Motorola Razr 50: మోటో నుంచి మరో కొత్త ఫ్లిప్‌ ఫోన్‌.. స్టన్నింగ్ లుక్స్‌తో..

|

Aug 22, 2024 | 12:27 PM

ప్రముఖ ఎలక్ట్రానిక్‌ దిగ్గజం మోటోరోలా భారత మార్కెట్లోకి కొత్త ఫోన్‌ను లాంచ్‌ చేస్తోంది. ఇటీవల మోటోరోలో రేజర్‌ 50 అల్ట్రా పేరుతో ఫోన్‌ను ఫోల్డబుల్ ఫోన్‌ను తీసుకొచ్చిన మోటో.. తాజాగా మరో కొత్త ఫోన్‌ను తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తోంది. మోటోరోలో రేజర్‌ 50 పేరుతో ఈ ఫోన్‌ను తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నారు. త్వరలోనే మార్కెట్లోకి రానున్న ఈ ఫోన్‌కు సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..

1 / 5
స్మార్ట్‌ఫోన్‌ తయారీ సంస్థ మోటోరోలా కొత్త ఫోన్‌ను లాంచ్‌ చేస్తోంది. మోటోరోలా రేజర్‌ సిరీస్‌లో భాగంగా మోటోరోలా రేజర్‌ 50 ఫోన్‌ను తీసుకొస్తోంది. త్వరలోనే భారత మార్కెట్లోకి తీసుకొచ్చేందుకు సన్నహాలు చేస్తున్నారు.

2 / 5
రేజర్‌ 50 ఫీచర్ల విషయానికొస్తే ఇందులో 3.6 ఇంచెస్‌తోకూడిన ఫుల్‌హెచ్‌డీ పీఓఎల్‌ఈడీ కవర్‌ డిస్‌ప్లేను ఇవ్వనున్నారు. 90 హెచ్‌జెడ్‌ రిఫ్రెష్‌ రేట్‌ ఈ స్క్రీన్‌ సొంతం. అలాగే ఇందులో 6.9 ఇంచెస్‌తో కూడిన ఫుల్‌హెచ్‌డీ+ పీఓఎల్‌ఈడీ డిస్‌ప్లేను ఇవ్వనున్నారు. 300నిట్స్‌ పీక్‌ బ్రైట్‌నెట్‌ ఈ స్క్రీన్‌ సొంతం.

3 / 5
ఇక ఈ స్మార్ట్‌ ఫోన్‌ మీడియా టెక్‌ డైమన్సిటీ 7300 ఎక్స్‌ చిప్‌తో పనిచేయనుంది. ఇందులో 12 బీజీ ర్యామ్‌, 512 జీబీ స్టోరేజ్‌ను ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. ఈ ఫోన్‌ ఆండ్రాయిడ్ 14 ఆపరేటింగ్ సిస్టమ్‌తో పనిచేయనుంది.

4 / 5
కెమెరా విషయానికొస్తే ఈ స్మార్ట్ ఫోన్‌లో 50 మెగాపిక్సెల్స్‌తో కూడిన ప్రైమరీ కెమెరాను ఇవ్వనున్నారు. అలాగే 13 మెగాపిక్సెల్స్‌తో కూడిన అల్ట్రా వైడ్‌ యాంగిల్‌ లెన్స్‌తో కూడిన సెకండరీ ెమెరాు ఇ్వవనున్నట్లు తెలుస్తోంది.

5 / 5
ఇక బ్యాటరీ విషయానికొస్తే ఈ ఫోన్‌లో 30 వాట్స్‌ వైర్డ్‌ ఛార్జింగ్‌కు, 15 వాట్స్‌ వైర్‌లెస్‌ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేసే 4200 ఎమ్‌ఏహెచ్‌ బ్యాటరీని ఇవ్వనున్నారు. ధరకు సంబంధించి ఇప్పటి వరకు ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు.