
ప్రముఖ ఎలక్ట్రానిక్ దిగ్గజం మోటోరాలో మార్కెట్లోకి కొత్త స్మార్ట్ ఫోన్‌ను లాంచ్ చేస్తోంది. మోటో ఎక్స్ 30 ప్రో పేరుతో తీసుకొస్తున్న ఈ ఫోన్‌లో అధునాతన ఫీచర్లను తీసుకొస్తున్నారు.

ఆగస్టు 2న చైనాలో లాంచ్ కానున్న ఈ స్మార్ట్ ఆ తర్వాత భారత్‌లోకి రానుంది. ఈ ఫోన్‌లో ఏకంగా 200 మెగాపిక్సెల్స్‌తో కూడిన రెయిర్ కెమెరాను అందిస్తున్నారు. ఇంత క్లారిటీతో వస్తున్న తొలి స్మార్ట్‌ఫోన్ ఇదే కావడం విశేషం.

ఈ స్మార్ట్ ఫోన్ స్నాప్ డ్రాగన్ 8+ జన్1 ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. 125 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ ఈ ఫోన్ సొంతం. దీంతో ఫోన్ బ్యాటరీ వేగంగా ఛార్జింగ్ అవుతుంది.

ఆండ్రాయిడ్ 12 ఆపరేటింగ్ సిస్టమ్‌తో పనిచేసే ఈ ఫక్షన్‌లో 12 జీబీ ర్యామ్ ఉంటుందని తెలుస్తోంది. అలాగే ఇందులో ఓఎల్‌ఈడీ డిస్‌ప్లే అనే ప్రత్యేక ఫీచర్‌ను అందించనున్నారు.

ఈ స్మార్ట్‌ఫోన్ వైర్‌లెస్ చార్జింగ్ టెక్నాలజీతో కూడా పనిచేస్తుంది. ఇక ధర విషయానికొస్తే మోటో ఎక్స్ 30 ప్రో సుమారు రూ. 70 వేలపైగా ఉండనున్నట్లు తెలుస్తోంది.