Honor 200: లాంచింగ్‌కు సిద్ధమైన హానర్‌ కొత్త ఫోన్‌.. కళ్లు చెదిరే ఫీచర్లతో..

|

Jul 04, 2024 | 9:54 PM

చైనాకు చెందిన స్మార్ట్‌ ఫోన్‌ దిగ్గజం హానర్‌ కొత్త ఫోన్‌ను లాంచ్‌ చేసేందుకు సిద్ధమైంది. హానర్‌ 200 సిరీస్‌ పేరుతో ఈ ఫోన్‌లను తీసుకొస్తున్నారు. ఇందులో భాగంగా హానర్‌ 200, హానర్‌ 200 ప్రో పేరుతో ఫోన్‌లను లాంచ్‌ చేయనున్నారు. ఇంతకీ ఫోన్‌లో ఎలాంటి ఫీచర్లు ఉన్నాయి.? ధర ఎంత.? లాంటి పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..

1 / 5
చైనాకు చెందిన స్మార్ట్ ఫోన్‌ దిగ్గజం హానర్ కొత్త సిరీస్‌ను లాంచ్‌ చేయనుంది. హానర్‌ 200, హానర్‌ 200 ప్రో పేర్లతో ఈ ఫోన్‌లను తీసుకొస్తున్నారు. త్వరలోనే భారత మార్కెట్లోకి ఈ ఫోన్‌లను తీసుకొస్తున్నారు. ఈ ఫోన్‌కు సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.

2 / 5
హానర్ 200 స్మార్ట్‌ఫోన్‌లో 6.7 ఇంచెస్‌తో కూడిన హెచ్‌డీ+ కర్వ్డ్‌ ఓఎల్‌ఈడీ డిస్‌ప్లేను అందించారు. 2664 x 1200 పిక్సెల్స్‌ రిజల్యూషన్‌, 120 హెచ్‌జెడ్‌ రిఫ్రెట్ రేట్‌ను అందింనున్నారు. 400 నిట్స్‌ పీక్‌ బ్రైట్‌నెస్‌ ఈ స్క్రీన్ సొంతం.

3 / 5
హానర్‌ 200 క్వాల్కమ్‌ స్నాప్‌డ్రాగన్‌ 7 జెన్‌ 3 చిప్‌సెట్‌తో పనిచేస్తుంది. ఈ ఫోన్‌ను 16 జీబీ ర్యామ్‌, 512 జీబీ స్టోరేజ్‌ వేరియంట్‌తో తీసుకొస్తున్నట్లు సమాచారం. 50 ఎంపీ రెయిర్ కెమెరా, 50 ఎంపీ ఫ్రంట్‌ కెమెరాను అందించనున్నారు.

4 / 5
హానర్‌ 200 ప్రో స్మార్ట్‌ ఫోన్‌ విషయానికొస్తే ఇందులో 6.78 ఇంచెస్‌తో కూడిన ఓఎల్‌ఈడీ డిస్‌ప్లేను అందించారు. 16 జీబీ ర్యామ్‌, 1 టీబీ స్టోరేజ్‌ ఈ ఫోన్‌ సొంతం. ఇందులో క్వాల్కమ్‌ స్నాప్‌డ్రాగన్ 8ఎస్‌ జెన్‌ 3 చిప్‌సెట్‌ను అందించారు. 50 ఎంపీ రెయిర్‌ కెమెరా, 50 ఎంపీ కెమెరా ఫ్రంట్‌ కెమెరాను ఇచ్చారు.

5 / 5
ధర విషయానికొస్తే హానర్‌ 200 స్మార్ట్ ఫోన్‌ 12 జీబీ ర్యామ్‌, 256 జీబీ స్టోరేజ్‌ వేరియంట్‌ ధర రూ. 31,000, 16 జీబీ ర్యామ్‌, 512 జీబీ స్టోరేజ్‌ ధర రూ. 37,000గా ఉండనుంది. ఇక హానర్‌ 200 ప్రో 12 జీబీ ర్యామ్‌, 256 జీబీ స్టోరేజ్‌ ధర రూ.40 వేలుగా, 16 జీబీ ర్యామ్‌, 1 టీబీ స్టోరేజ్‌ ధర రూ. 51,00గా ఉండొచ్చని అంచనా.