
ఇక ఆండ్రాయిడ్ 13 ఆపరేటింగ్ సిస్టమ్‌తో పని చేసే ఈ స్మార్ట్ ఫోనను ఆండ్రాయిడ్ 14కి కూడా అప్‌డేట్ చేసకోవచ్చు. ఇందులో 6.5 ఇంచెస్ ఫుల్ హెచ్‌డీ+ డిస్‌ప్లేను అందించారు. స్టోరేజ్‌ను మైక్రో ఎస్‌డీ కార్డు ద్వారా 1 టీబీ వరకు పెంచుకోవచ్చు.

ప్రముఖ స్మార్ట్ ఫోన్ దిగ్గజం మోటోరొలా భారత మార్కెట్లోకి బడ్జెట్ ధరలో 5జీ స్మార్ట్ ఫోన్‌ను లాంచ్ చేసింది. మోటో జీ54 పేరుతో తీసుకొచ్చిన ఈ 5జీ స్మార్ట్ ఫోన్‌ను తక్కువ ధరలోనే మంచి ఫీచర్లతో మార్కెట్లోకి తీసుకొచ్చారు.

ఈ స్మార్ట్ ఫోన్ మీడియాటెక్ డైమెన్సిటీ 7020 ప్రాసెసర్‌తో పని చేస్తుంది. 12 జీబీ వరకు ర్యామ్, 256 జీబీ స్టోరేజ్ వేరియంట్స్‌తో ఈ ఫోన్‌ను లాంచ్ చేశారు. 6000 ఎంఏహెచ్ బ్యాటరీ ఈ ఫోన్ సొంతం. 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్‌తో కూడిన హోల్ పంచ్ డిస్‌ప్లేను అందించారు.

ధర విషయానికొస్తే ఈ స్మార్ట్ ఫోన్ 8 జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ. 15,999 గా ఉంది. అలాగే 12 జీబీ ర్యామ్, 256 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ. 18,999గా నిర్ణయించారు. ఇదిలా ఉంటే ఐసీఐసీఐ క్రెడిట్ కార్డ్ ద్వారా కొనుగోలు చేస్తే రూ. 1500 వరకు ఇన్‌స్టాంట్ డిస్కౌంట్ పొందొచ్చు.

కెమెరా విషయానికొస్తే ఈ స్మార్ట్ ఫోన్‌లో డ్యూయల్ కెమెరా సెటప్‌తో రెయిర్ కెమెరాను ఇచ్చారు. ఇందులో 50 మెగాపిక్సెల్, 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ సెన్సార్‌ను అందించారు. అలాగే సెల్ఫీల కోసం 16 మెగాపిక్సెల్స్‌తో కూడిన ఫ్రంట్ కెమెరాను అందించారు.