
అమెజాన్ సమ్మర్ సేల్‌లో భాగంగా పలు ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్లపై భారీ ఆఫర్లను ప్రకటించింది. ఈ నేపథ్యంలోనే ఇయర్ బడ్స్‌పై కూడా డిస్కౌంట్‌లను ప్రకటించింది. మరి అలాంటి కొన్ని బెస్ట్ డీల్స్ మీకోసం.

Realme Buds Q2s: ఈ ఇయర్‌బడ్స్ రూ. 1500 డిస్కౌంట్‌పోనూ రూ. 1999కు అందుబాటులో ఉన్నాయి. కేవలం 10 నిమిషాల ఛార్జ్ చేస్తే 3 గంటల ప్లేబ్యాక్ టైమ్ వస్తుంది. ఛార్జింగ్ కేస్‌తో పాటు 20 గంటల ప్లేబ్యాక్ టైమ్ వస్తుంది.

OnePlus Buds Z2: వన్‌ప్లస్‌కు చెందిన ఈ ఇయర్‌బడ్స్‌పై అమెజాన్‌లో రూ. 1400 డిస్కౌంట్ లభిస్తోంది. దీంతో వీటిని రూ. 4,599కి సొంతం చేసుకోవచ్చు. లౌడ్ క్లియర్, బాస్సీ అవుట్‌పుట్ ఈ ఇయర్ బడ్స్ ప్రత్యేకత.

Oppo Enco M32: ఈ వైర్ లెస్ ఇయర్ ఫోన్స్‌పై రూ. 1400 డిస్కౌంట్‌తో రూ. 1599కి అందుబాటులో ఉంది. నెక్ బ్యాండ్‌తో వచ్చే ఈ ఇయర్‌ఫోన్స్ ఏకంగా 28 గంటల ప్లేబ్యాక్ టైమ్ అందిస్తుంది.

OnePlus Bullets Wireless Z2: ఈ నెక్‌బ్యాండ్ బ్లూటూత్ ఇయర్‌ఫోన్ ఆఫర్‌లో భాగంగా రూ. 1899కి లభిస్తుంది. ఇవి ఏకంగా 30 గంటల ప్లేబ్యాక్ టైమ్‌ను అందిస్తాయి.

JBL Tune 130 NC: వీటిలో అమెజాన్ సేల్ ఏకంగా రూ. 2500 డిస్కౌంట్ లభిస్తుంది. 36 శాతం తగ్గింపు ధరతో రూ. 4,499కి అందుబాటులో ఉంది. నాయిస్ క్యాన్సిలేషన్ వీటి ప్రత్యేకత. ఛార్జింగ్ కేస్‌తో 40 గంటల ప్లేబ్యాక్ అందిస్తుంది.