Best Budget Phones: బడ్జెట్ ఫోన్స్‌కు పెరుగుతున్న క్రేజ్.. టాప్-5 ఫోన్స్ ఇవే..!

Updated on: Apr 06, 2025 | 4:30 PM

భారతదేశంలోని యువత ఇటీవల కాలంలో స్మార్ట్ ఫోన్స్‌ను అధికంగా వినియోగిస్తున్నారు. అయితే దేశంలో ఎక్కువ మంది ప్రజలు మధ్యతరగతికి చెందిన వారు కావడంతో బడ్జెట్ ఫ్రెండ్లీ స్మార్ట్‌ఫోన్స్ కొనుగోలుకు ఇష్టపడుతున్నారు. ఈ నేపథ్యంలో అన్ని కంపెనీలు బడ్జెట్ ఫ్రెండ్లీ స్మార్ట్‌ఫోన్‌లను అందుబాటులోకి తీసుకొస్తున్నాయి. ప్రస్తుతం మార్కెట్‌లో రూ.10 వేల తక్కువ ధరలో అందుబాటులో ఉన్న టాప్ స్మార్ట్ ఫోన్స్ గురించి మరిన్ని వివరాలను తెలుసుకుందాం.

1 / 5
మోటరోలా జీ05 స్మార్ట్ ఫోన్ కేవలం రూ.6,990కు అందుబాటులో ఉంది. మీడియాటెక్ హీలియో జీ81 చిప్‌సెట్‌ ఆధారంగా పని చేసే ఈ ఫోన్ గొరిల్లా గ్లాస్-2 ప్రొటెక్టెడ్ 6.67 అంగుళాల హెచ్‌డీ ప్లస్ డిస్‌ప్లేతో వస్తుంది. ఈ ఫోన్ 50 ఎంపీ ప్రైమరీ కెమెరాతో ఆకట్టుకుంటుంది. ఐపీ 54 వాటర్-రెసిస్టెంట్ రేటింగ్‌తో పాటు 5,200 ఎంఏహెచ్ బ్యాటరీ, 18 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్‌ ఈ ఫోన్ ప్రత్యేకతలు.

2 / 5
మోటరోలా జీ35 5జీ స్మార్ట్ ఫోన్ టాప్ బడ్జెట్ ఫ్రెండ్లీ స్మార్ట్ ఫోన్‌గా ఉంది. రూ.9999కే అందుబాటులో ఉండే ఈ ఫోన్ 120హెచ్‌జెడ్ రిఫ్రెష్ రేట్‌తో 6.72 అంగుళాల ఫుల్ హెచ్‌డీ ప్లస్ డిస్‌ప్లేతో వస్తుంది. అలాగే యూనిసాక్ టీ760 ప్రాసెసర్‌తో పని చేసే ఈ ఫోన్‌లో 50 ఎంపీ డ్యూయల్ కెమెరా, 16 ఎంపీ సెల్ఫీ కెమెరాతో వస్తుంది. ఈ ఫోన్‌లో 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉండడంతో పనితీరు బాగుంటుందని నిపుణులు చెబుతున్నారు.

3 / 5
రియల్‌మీ సీ61 స్మార్ట్‌‌ఫోన్ రూ.10 వేలలోపు ధరలో దొరికే బెస్ట్ బడ్జెట్ స్మార్ట్ ఫోన్. ఇది అధిక-రిఫ్రెష్-రేట్ డిస్‌ప్లేతో పాటు రోజంతా ఉపయోగించడానికి అతిపెద్ద బ్యాటరీతో వచ్చే సొగసైన స్మార్ట్‌ఫోన్. ఈ ఫోన్‌లో రియల్‌మీ యూఐ ద్వారా పని చేస్తుంది. సాధారణ గేమింగ్‌తో పాటు రోజువారీ పనులకు ఈ స్మార్ట్‌ఫోన్ చాలా బాగా ఉపయోగపడుతుంది.

4 / 5
రెడ్‌మి ఏ4 5జీ ఫోన్ రూ.8499 ధరకే అందుబాటులో ఉంది. తక్కువ ధరలో అందుబాటులో ఉండే 5జీ ఫోన్‌గా ఈ ఫోన్ రికార్డు చేజిక్కించుకుంది. మీడియాటెక్ చిప్‌సెట్‌తో వచ్చే ఈ ఫోన్‌లో 50 ఎంపీ ప్రధాన కెమెరాతో భారీ బ్యాటరీ ఉంటుంది. అందువల్ల రోజువారీ పనితీరులో మెరుగ్గా ఉంటుంది.

5 / 5
సామ్‌సంగ్ గెలాక్సీ ఎఫ్06 5జీ స్మార్ట్ ఫోన్ సామ్‌సంగ్ ఫోన్ లవర్స్‌కు బడ్జెట్‌లో అందుబాటులో ఉండే సూపర్ స్మార్ట్ ఫోన్. రూ.9,199 ధరలో అందుబాటులో ఉండే ఈ ఫోన్‌లో పెద్ద డిస్‌ప్లే, లాంగ్ లాస్టింగ్ బ్యాటరీ లైఫ్, సాధారణ ఫోటోగ్రఫీ అవసరాలకు సరిపోయే కెమెరాలతో ఆకర్షిస్తుంది. అధునాత ఫీచర్లతో అందుబాటులో ఉండే ఈ ఫోన్‌లో సాఫ్ట్‌వేర్ ఆప్టిమైజేషన్‌ ప్రత్యేకతగా నిలుస్తుంది.