iQOO Z7s 5G: చైనాకు చెందిన స్మార్ట్ ఫోన్ దిగ్గజం ఐకూపై కూడా బెస్ట్ డీల్ లభిస్తోంది. ఈ ఫోన్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 695 చిప్‌సెట్‌తో పనిచేస్తుంది. 44 వాట్స్ ఫాస్ట్ చార్జింగ్‌కు సపోర్ట్ చేసే 4500 ఎమ్‌ఏహెచ్ బ్యాటరీని అందించారు. ఆండ్రాయిడ్ 13 ఆపరేటింగ్ సిస్టమ్‌తో పనిచేసే ఈ ఫోన్‌లో 6.38 ఇంచెస్‌తో కూడిన అమోఎల్‌ఈడీ డిస్‌ప్లేను అందించారు. ధర విషయానికొస్తే ఈ ఫోన్ రూ. 17,999గా ఉంది.
OnePlus Nord CE 3 Lite: రూ. 20 వేలలోపు అందుబాటులో ఉన్న బెస్ట్ స్మార్ట్ ఫోన్స్‌లో వన్‌ప్లస్ మొదటి బెస్ట్ ఆప్షన్‌గా చెప్పొచ్చు. వన్‌ప్లస్ నార్డ్ సీఈ3 లైట్ ఫోన్ అమెజాన్ సేల్‌లో అందుబాటులో ఉంది. రూ. 2 వేల డిస్కౌంట్‌లో భాగంగా ఈ ఫోన్ రూ. 19,999కి సొంతం చేసుకోవచ్చు. అలాగే రూ. 1500 బ్యాంక్ డిస్కౌంట్ పొందొచ్చు. ఈ స్మార్ట్ ఫోన్‌లో ఏకంగా 108 ఎంపీ రెయిర్ కెమెరాను అందించారు. ఈ ఫోన్‌లో 6.72 ఇంచెస్‌తో కూడిన డిస్‌ప్లేను ఇచ్చారు. డ్యూయల్ స్టీరియో స్పీకర్స్ ఈ ఫోన్ సొంతం.
POCO X5 Pro: రూ. 20 వేల లోపు అందుబాటులో ఉన్న మరో బెస్ట్ స్మార్ట్ ఫోన్‌లో పోకో ఒకటి. పోకో ఎక్స్ 5 ప్రో స్మార్ట్ ఫోన్ ధర రూ. 18,499గా ఉంది. ఈ ఫోన్‌లో 6.67 ఇంచెస్‌తో కూడిన అమోఎల్‌ఈడీ డిస్‌ప్లేను అందించారు. 120 హెచ్‌జెడ్ రిఫ్రెష్ రేట్ ఈ ఫోన్ సొంతం. కెమెరా విషయానికొస్తే ఇందులో 108 ఎంపీ రెయిర్ కెమెరా, 16 ఎంపీ ఫ్రంట్ కెమెరాను అందించారు.
Redmi Note 12: రూ. 20 వేల లోపు అందుబాటులో ఉన్న మరో బెస్ట్ ఫోన్ రెడ్‌మీ నోట్ 12 ఒకటి. ఈ ఫోన్ 4 జీబీ ర్యామ్, 64 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ. 11,999గా ఉంది. కొన్ని కార్డులతో కొనుగోలు చేస్తే రూ. 1500 డిస్కౌంట్స్ పొందొచ్చు. ఈ ఫోన్‌లో 50 మగాపిక్సెల్ రెయిర్ కెమెరాను అందించారు. 5000 ఎమ్‌ఏహెచ్ బ్యాటరీ ఈ ఫోన్ సొంతం.
Samsung Galaxy M14: సామ్‌సంగ్ బ్రాండ్‌తో తక్కువ ధరలో అందుబాటులో ఉన్న బెస్ట్ 5జీ ఫోన్స్‌లో ఇది ఒకటి. ఈ ఫోన్‌ను ప్రముఖ ఈ కామర్స్ సైట్ అమెజాన్‌లో రూ. 12,039కి సొంతం చేసుకోవచ్చు. ఈ ఫోన్ ఫీచర్ల విషయానికొస్తే ఇందులో 50 మెగాపిక్సెల్స్‌తో కూడిన రెయిర్ కెమెరాను అందించారు. అలాగే 6000 ఎమ్‌ఏహెచ్ బ్యాటరీ ఈ ఫోన్ సొంతం. ఆక్టాకోర్ 2.4 జీహెచ్ 5ఎన్‌ఎమ్ ప్రాసెసర్‌ను అందించారు.