మోటో జీ 45 స్మార్ట్ ఫోన్ లోని 6.45 అంగుళాల హెచ్ డీ ప్లస్ డిస్ ప్లేతో విజువల్ చాాలా స్పష్టంగా కనిపిస్తుంది. క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 6ఎస్ జెన్ 3 చిప్, గ్రాఫిక్స్ కోసం ఆడ్రెనో 619 జీపీయూ, 8 జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజీతో ఆకట్టుకుంటోంది. మైక్రో ఎస్డీ కార్ట్ స్లాట్ ద్వారా 1 టీబీ వరకూ స్టోరేజీని విస్తరించవచ్చు. 18 డబ్ల్యూ ఫాస్ట్ చార్జింగ్ కు మద్దతు ఇచ్చే 5000 ఎంఏహెచ్ బ్యాటరీతో చార్జింగ్ సమస్యలు ఉండవు. ఏడాది పాటు ఓఎస్ అప్ డేట్లు, మూడేళ్ల భద్రతా ప్యాచ్ లకు హామీ ఉంది.
రియల్ మీ సీ63 స్టార్ట్ ఫోన్ లో 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఏర్పాటు చేశారు. ఇది 10 డబ్ల్యూ ఫాస్ చార్జ్ కు మద్దతు ఇస్తుంది. 6.67 అంగుళాల హెచ్ డీ ప్లస్ స్క్రీన్, ఆక్టా కోర్ మీడియా టెక్ డైమెన్సిటీ 6300 6ఎన్ఎం ప్రాసెసర్, గ్రాఫిక్స్ కోసం ఆర్మ్ మాలి జీ57 ఎంసీ2 జీపీయూ, 8 జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజీ తదితర ప్రత్యేకతలు ఉన్నాయి. మైక్రో ఎస్డీ కార్డు స్లాట్ ద్వారా 2 టీబీ వరకూ మెమరీని విస్తరించవచ్చు.
రెడ్ మీ 13సీ 5జీ ఫోన్ లో 6.74 అంగుళాల హెచ్ డీ ప్లస్ డిస్ ప్లే, గ్రాఫిక్స్ ఇంటెన్సివ్ అవసరాల కోసం మాలి జీ57 ఎంపీ2 జీపీయూ, ఆక్టా కోర్ మీడియా టెక్ హెలియో జీ85 చిప్ సెట్ ఆకట్టుకుంటున్నాయి. 8 జీబీ ర్యామ్, 256 జీబీ స్టోరేజీతో అందుబాటులోకి వచ్చింది. దీన్ని మైక్రో ఎస్డీ కార్డు స్లాట్ ద్వారా 1టీబీ వరకూ విస్తరించుకోవచ్చు. 50 ఎంపీ ప్రైమరీ, 2 ఎంపీ మాక్రో లెన్స్, 2 ఎంపీ లెన్స్ ట్రిపుల్ కెమెరా సెటప్ తో వస్తోంది. సెల్ఫీలు, ఫొటోలు చక్కగా తీసుకోవడానికి 5 ఎంపీ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా అమర్చారు.
వీవో టీ3 లైట్ స్మార్ట్ ఫోన్ లో 6.56 అంగుళాల హెచ్ డీ ప్లస్ ఎల్ సీడీ డిస్ ప్లే, సైడ్ మౌంటెట్ ఫింగర్ ఫ్రింట్ సెన్సార్, 3.5 ఎంఎం జాక్, దుమ్ము నీటి నిరోధానికి ఐపీ 65 రేటింగ్ తదితర ప్రత్యేకతలు ఉన్నాయి. మీడియా టెక్ డైమెన్సిటీ 6300 చిప్ సెట్, గ్రాఫిక్స్ కోసం మాలి జీ57 ఎంసీ2 జీపీయూ, 6 జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజీతో అందుబాటులోకి వచ్చింది. మైక్రో ఎస్ డీ కార్డు ద్వారా 1 టీబీ వరకూ స్టోరేజీని విస్తరించుకోవచ్చు. వెనుక భాగంలో 50 ఎంపీ ప్రైమరీ సెన్సార్, సెకండరీ 2 ఎంపీ డెప్త్ సెన్సార్, ముందు భాగంలో 8 ఎంపీ సెల్ఫీ షూటర్ ఏర్పాటు చేశారు.
ఇన్ఫినిక్స్ హాట్ 50 స్మార్ట్ ఫోన్ లో 6.7 అంగుళాల హెచ్ డీ ప్లస్ ఎల్ సీడీ డిస్ ప్లే, గ్రాఫిక్స్ కోసం మాలి జీ57 ఎంసీ2 జీపీయూ, మీడియా టెక్ డైమెన్సిటీ 6300 ప్రాసెసర్, 8 జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజీ ఏర్పాటు చేశారు. మైక్రో ఎస్డీ కార్డ్ స్లాట్ ద్వారా 1 టీబీ వరకూ స్టోరేజీని విస్తరించుకోవచ్చు. కెమెరా విషయానికి వస్తే 48 ఎంపీ సోనీ ప్రైమరీ సెన్సార్, డ్యూయల్ ఎల్ఈడీ ఫ్లాష్ తో కూడిన డెప్త్ సెన్సార్, సెల్పీలు వీడియో కాల్స్ కోసం 8 ఎంపీ అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్ ఉన్నాయి. 18 డబ్ల్యూ ఫాస్ట్ చార్జింగ్ కు మద్దతు ఇచ్చే 5000 ఎంఏహెచ్ బ్యాటరీ, ఐపీ 54 రేటింగ్ తదితర ప్రత్యేకతలు ఉన్నాయి.