Apple goggle: యాపిల్‌ నుంచి మరో అద్భుత సృష్టి.. కళ్ల ముందే ప్రపంచం ఆవిష్కృతం.

|

Jun 06, 2023 | 11:23 AM

టెక్నాలజీకి పెట్టింది పేరైన యాపిల్ సంస్థ మరో అద్భుతాన్ని ఆవిష్కరించింది. యాపిల్ గాగిల్స్‌ పేరుతో అడ్వాన్స్‌డ్‌ హెడ్‌సెట్‌ను తీసుకొచ్చింది. ఇంతకీ ఈ గాగిల్స్‌లో ఉన్న ఫీచర్లు ఏంటి.? దీని ధర ఎంత..?లాంటి పూర్తి వివరాలు మీకోసం..

1 / 5
టెక్‌ ప్రియులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న రోజు రానే వచ్చేసింది. ఎన్నో అద్భుత ప్రొడక్ట్స్‌కి రూపకల్పన చేసి ప్రపంచ టెక్‌ మార్కెట్‌ను ఏలుతోన్న యాపిల్‌ కొత్త ప్రొడెక్ట్‌ని పరిచయం చేసింది.

2 / 5
యాపిల్‌ గాగిల్స్‌ పేరుతో తీసుకొచ్చిన ఈ అత్యాధునిక హెడ్‌సెట్‌తో వర్చువల్‌ ప్రపంచాన్ని కళ్లకు కట్టినట్లు చూపించనుంది. ఈ హెడ్‌సెట్‌తో 100 ఇంచ్‌ల స్క్రీన్‌కు సమానమైన డిస్‌ప్లేను వీక్షించొచ్చు.

3 / 5
యూజర్లు చేతులు, కళ్లతోనే యాప్స్‌ను కంట్రోల్‌ చేసుకోవచ్చు. స్క్రీన్ సైజ్‌ను పెద్దగా చేసుకోవచ్చు. ఉద్యోగులు వర్చువల్‌గా మీటింగ్స్‌ ఏర్పాటు చేసుకోవచ్చు.

4 / 5
ఈ గాగిల్స్‌లో 12 కెమెరాలు, ఆరు మైక్రోఫోన్లతో పాటు సెన్సార్లను అందించారు. ఈ హెడ్‌సెట్‌ను ధరించినా యూజర్లు బయటి వ్యక్తులను చూడడానికి వీలుగా డిజైన్‌ చేశారు.

5 / 5
విజన్‌ ప్రోగా పేర్కొంటున్న ఈ యాపిల్‌ గాగిల్స్‌.. పర్సనల్‌ టెక్నాలజీలో కొత్త ఒరవడిని సృష్టిస్తుందని కుక్‌ అభిప్రాయపడ్డారు. దీని ధర 3,500 డాలర్లుగా ఉండనుంది. మన కరెన్సీలో చెప్పాలంటే రూ. 2. 89 లక్షల వరకు ఉండొచ్చని అచంనా. వచ్చే ఏడాది ఆరంభంలో ఈ ప్రొడక్స్‌ మార్కెట్లోకి రానుంది.