ఐఫోన్‌లో i అంటే ఏంటో తెలుసా? దాని వెనుకున్న ఇంట్రెస్టింగ​్‌ స్టోరీ ఇదే!

Updated on: Apr 06, 2026 | 3:31 PM

ఆపిల్ ఉత్పత్తులైన ఐఫోన్, ఐప్యాడ్‌లో కనిపించే 'i' అక్షరం అర్థం చాలామందికి తెలియదు. 1998లో స్టీవ్ జాబ్స్ దీనిని 'ఇంటర్నెట్'గా పరిచయం చేసినా, తదనంతరం 'ఇండివిడ్యువల్, ఇన్‌ఫామ్, ఇన్‌స్పైర్' వంటి విస్తృత అర్థాలను జోడించారు. కాలక్రమేణా, ఇది ఆపిల్ బ్రాండ్ గుర్తింపు, ఆవిష్కరణలకు ప్రతీకగా మారింది.

1 / 5
టెక్నాలజీ దిగ్గజం యాపిల్‌ కంపెనీ ఉత్పత్తుల్లో కనిపించే i అక్షరం గురించి చాలామందిలో ఆసక్తి ఉంటుంది. ఐఫోన్, ఐప్యాడ్, ఐపాడ్ వంటి పరికరాల్లో కనిపించే ఈ ఐకి ఒకే అర్థం కాకుండా, కాలక్రమేణా విస్తరించిన భావన ఉందని నిపుణులు చెబుతున్నారు. ఈ కథ 1998లో ప్రారంభమైంది. అప్పటి కంపెనీ సహవ్యవస్థాపకుడు స్టీవ్‌ జాబ్స్‌ మొదటిసారిగా ఐమ్యాక్‌ను పరిచయం చేసినప్పుడు i అక్షరానికి అర్థం వెల్లడించారు.

2 / 5
ప్రధానంగా ఇది ఇంటర్నెట్‌ను సూచిస్తుందని ఆయన పేర్కొన్నారు. ఆ కాలంలో ఇంటర్నెట్ విస్తరణ వేగంగా జరుగుతుండగా, వినియోగదారులను సులభంగా ఆన్‌లైన్‌కు కనెక్ట్ చేయగల సామర్థ్యాన్ని ఈ ఉత్పత్తి కలిగి ఉందని తెలియజేయడం ప్రధాన ఉద్దేశం.

3 / 5
అయితే i అక్షరం కేవలం ఇంటర్నెట్ కే పరిమితం కాలేదు. అదే ప్రదర్శనలో స్టీవ్ జాబ్స్ దీనికి మరిన్ని అర్థాలు కూడా ఉన్నాయని వివరించారు. అవి ఇండివిడ్యువల్, ఇన్‌స్ట్రక్ట్, ఇన్‌ఫామ్, ఇన్‌స్పైర్ వంటి భావనలను సూచిస్తాయి. ఈ పదాలు టెక్నాలజీ కేవలం కనెక్టివిటీ కోసం మాత్రమే కాకుండా, వినియోగదారుల వ్యక్తిగత అభివృద్ధి, సృజనాత్మకతకు కూడా తోడ్పడాలనే ఆపిల్ తత్వాన్ని ప్రతిబింబించాయి.

4 / 5
కాలక్రమేణా i ఒక ప్రత్యేక అర్థాన్ని దాటి బ్రాండ్ గుర్తింపుగా మారింది. వినియోగదారులు దీనిని ఆపిల్ ఎకోసిస్టమ్, డిజైన్ సరళత, వినియోగదారుకు అనుకూలమైన టెక్నాలజీతో అనుసంధానం చేయడం ప్రారంభించారు. దీంతో ఇది కేవలం ఒక అక్షరం కాకుండా, ఆవిష్కరణకు ప్రతీకగా నిలిచింది.

5 / 5
నేటి పరిస్థితిలో iకి కచ్చితమైన ఒకే అర్థం లేదని చెప్పవచ్చు. ఇంటర్నెట్ యుగంలో ప్రారంభమైన ఈ ధోరణి, ఇప్పుడు పర్సనలైజేషన్, స్మార్ట్ టెక్నాలజీ వంటి విస్తృత భావనలను సూచించే బ్రాండ్ చిహ్నంగా మారింది.

Follow Us