Wireless mouse: రూ. 500లోపు వైర్‌లెస్‌ మౌస్‌లు.. అమెజాన్‌ సేల్‌లో భారీ డిస్కౌంట్స్‌.

|

Oct 31, 2023 | 3:50 PM

ప్రస్తుతం వైర్‌లెస్‌ మౌస్‌లకు డిమాండ్ పెరుగుతోంది. ఒకప్పుడు వైర్‌లెస్‌ మౌస్‌లంటే కనీసం రూ. 2 వేలు పెట్టాల్సిందే. అయితే ప్రస్తుతం మౌస్‌ల ధరలు భారీగా తగ్గముఖం పట్టాయి. మరీ ముఖ్యంగా ఈ కామర్స్‌ సైట్స్‌లో భారీ డిస్కౌంట్ అందిస్తున్నారు. తాజాగా అమెజాన్‌ నిర్వహిస్తున్న సేల్‌లో భాగంగా రూ. 500లోపే మౌస్‌లను సొంతం చేసుకునే అవకాశం కల్పించారు. ఇంతకీ రూ. 500లోపు అందుబాటులో ఉన్న మౌస్‌లకు సంబంధించిన పూర్తి వివరాలు మీకోసం..

1 / 5
amazon basics: అమెజాన్‌ బేసిక్స్‌ కంపెనీకి చెందిన ఈ వైర్‌లెస్‌ మౌస్‌ను రీఛార్జబుల్‌గా రూపొందించారు. బ్యాటరీ సెల్స్‌ అవసరం లేకుండా ఫోన్‌ ఛార్జర్‌తో ఈ మౌస్‌ను ఛార్జింగ్ చేసుకోవచ్చు. ఈ మౌస్‌ అసలు ధర రూ. 2,300కాగా అమెజాన్‌ సేల్‌లో భాగంగా ఏకంగా 81 శాతం డిస్కౌంట్‌తో రూ. 449కే సొంతం చేసుకోవచ్చు. ల్యాప్‌టాప్‌తో పాటు పర్సనల్ కంప్యూటర్‌కు ఈ మౌస్‌ను కనెక్ట్ చేసుకొని ఉపయోగించుకోవచ్చు.

2 / 5
HP M120 Wireless Mouse: హెచ్‌పీ కంపెనీకి చెందిన ఈ వైర్‌లెస్‌ మౌస్‌ అసలు ధర రూ. 999కాగా 57 శాతం డిస్కౌంట్‌లో భాగంగా రూ. 429కి సొంతం చేసుకోవచ్చు. 3డీ స్క్రోల్‌ వీల్‌, డీపీఐ స్విఛ్‌ బటన్‌ వంటి ఫీచర్స్‌ ఇందులో అందించార. ఈ మౌస్‌తో పాటు 3 ఏళ్ల వారంటీని కంపెనీ అందిస్తోంది.

3 / 5
Portronics Toad III Wireless Mouse: ఈ వైర్‌లెస్‌ మౌస్‌లో 2.4 జీహెచ్‌జెడ్‌ డ్యూయల్ కనెక్టివిటీ ఫీచర్‌ను అందించారు. రీఛార్జబుల్‌ మౌస్‌ అసలు ధర రూ. 999కాగా 50 శాతం డిస్కౌంట్‌లో భాగంగా రూ. 499కే సొంతం చేసుకోవచ్చు. 10 మీటర్ల రేంజ్ వరకు ఈ మౌస్‌ వైర్‌ లేకుండా పని చేస్తుంది.

4 / 5
ZEBRONICS Zeb-Jaguar Wireless Mouse: రూ. 500లో లభిస్తున్న మరో బెస్ట్‌ బ్రాండెడ్‌ మౌస్‌లలో జిబ్రోనిక్‌ కంపెనీకి చెందిన ఈ మౌస్‌ ఒకటి. ఈ మౌస్‌ అసలు ధర రూ. 1,920కాగా, 79 శాతం డిస్కౌంట్‌లో భాగంగా రూ. 398కే సొంతం చేసుకోవచ్చు. వైర్‌లెస్‌ యూఎస్‌బీ టెక్నాలజీతో పనిచేసే ఈ మౌస్‌లో యూఎస్‌బీ నానో రిసీవర్‌ ఫీచర్‌ను అందించారు.

5 / 5
Logitech B170 Wireless Mouse: రూ. వెయ్యిలోపు లభిస్తున్న మరో బెస్ట్‌ మౌస్‌లలో ఇదీ ఒకటి.. ఈ మౌస్‌ అసలు ధర రూ. 895కాగా 44 శాతం డిస్కౌంట్‌లో భాగంగా రూ. 499కే సొంతం చేసుకోవచ్చు. అప్టికల్‌ ట్రాకింగ్ వంటి ఫీచర్‌ను అందించారు. ఈ మౌస్‌ 12 నెలల బ్యాటరీ లైఫ్‌ను అందిస్తుంది.