
నాయిస్ కలర్‌ఫిట్ అల్ట్రా 3 బ్లూటూత్ కాలింగ్ స్మార్ట్ వాచ్ 1.96 ఎమోఎల్ఈడీ డిస్‌ప్లే, ప్రీమియం మెటాలిక్ బాడీతో వస్తుంది. ఈ వాచ్ ఈ సేల్‌లో 63 శాతం తగ్గింపుతో అందుబాటులో ఉంది. బ్లూటూత్ కాలింగ్ ఫంక్షనాలిటీతో వెంటనే నేరుగా కాల్స్‌ను స్వీకరించవచ్చు. ఫంక్షనల్ క్రౌన్, జెట్ బ్లాక్‌లో సిలికాన్ స్ట్రిప్‌తో సౌకర్యవంతంగా ఉంటుంది. ఈ వాచ్‌ను కేవలం రూ.2999కు సొంతం చేసుకోవచ్చు.

క్రాస్ బీట్స్ స్మార్ట్ వాచ్ 1.90 అంగుళాల 3డీ కర్వ్ యూహెచ్‌డీ డ్యూయల్ చిప్ బ్లూటూత్ కాలింగ్ స్మార్ట్ వాచ్ 80 శాతం తగ్గింపుతో అందుబాటులో ఉంటుంది. అంతర్నిర్మిత గేమ్ ఫీచర్‌తో, 10 రోజుల బ్యాటరీ బ్యాకప్‌తో ఈ వాచ్ అందరినీ ఆకర్షిస్తుంది. ఈ వాచ్ ద్వారా ఎస్‌పీఓ2 స్థాయిలతో పాటు హృదయ స్పందన రేటును పర్యవేక్షించవచ్చు. 100 ప్లస్ స్పోర్ట్స్ మోడ్‌లతో ప్రతి వర్కౌట్ సమయంలో మీకు సాయం చేస్తుంది. క్రాస్‌బీట్స్ స్మార్ట్‌వాచ్ ధర: రూ. 1,999కు సొంతం చేసుకోవచ్చు.

బోట్ వేవ్ సిగ్మా ఈ సేల్‌లో 81 శాతం తగ్గింపుతో లభిస్తుంది. 2.01 అంగుళాల హెచ్‌డీ డిస్‌ప్లేతో బ్లూటూత్ కాలింగ్ ఫంక్షనాలిటీతో డీఐవై వాచ్ ఫేస్ స్టూడియోతో ఈ వాచ్ అందరినీ ఆకర్షిస్తుంది. హృదయ స్పందన రేటు, ఎస్‌పీఓ2 ట్రాక్ చేయవచ్చు. ఐపీ 67 వాటర్ రెసిస్టెన్స్‌తో యూనీ సెక్స్ లుక్‌తో అందుబాటులో ఉండే ఈ వాచ్ ధర రూ.1,399గా ఉంది.

ఫాస్ట్రాక్ లిమిట్‌లెస్ గ్లైడ్ అడ్వాన్స్‌డ్ స్మార్ట్‌వాచ్‌ను 51 శాతం తగ్గింపుతో లభిస్తుంది. అల్ట్రా వీయూ హెచ్‌డీ డిస్2ప్లేతో వచ్చే ఈ స్మార్ట్ వాచ్ బ్లూటూత్ కాలింగ్, శక్తివంతమైన ఏటీఎస్ చిప్‌సెట్‌తో ఆకర్షిస్తుంది. మీ స్టైల్, ఫిట్‌నెస్ రొటీన్‌కు సరిపోయేలా 100 కంటే ఎక్కువ స్పోర్ట్స్ మోడ్‌లతో అందుబాటులో ఉండే ఈ వాచ్‌లో అదనపు సౌలభ్యం కోసం అంతర్నిర్మిత కాలిక్యులేటర్, వాయిస్ అసిస్టెంట్, అంతర్నిర్మిత గేమ్‌లు అందుబాటులో ఉంటాయి. 24/7 హృదయ స్పందన పర్యవేక్షణ, ఐపీ 68 నీటి నిరోధకతతో వచ్చే ఫాస్ట్రాక్ స్మార్ట్‌వాచ్ ధర రూ. 1,799గా ఉంది.

ఫైర్‌బోల్ట్ స్మార్ట్ వాచ్ ఈ సేల్‌లో 80 శాతం తగ్గింపుతో వస్తుంది. బ్లూటూత్ కాలింగ్, సుదీర్ఘ కనెక్టివిటీని ఆశ్వాదించడానికి మిమ్మల్ని అనుమతిస్తుంది. మీ ఎస్‌పీఓ2 స్థాయిలను కూడా పర్యవేక్షించవచ్చు 1.7 అంగుళాల స్క్రీన్‌తో మెటల్ బాడీతో స్టైలిష్ రూపాన్ని నిర్ధారిస్తుంది. పూర్తి టచ్ ఇంటర్‌ఫేస్‌తో ఫీచర్-ప్యాక్డ్ స్మార్ట్‌వాచ్‌ను రూ. 1,999కు పొందవచ్చు.