
ఏఐ స్డూడియో అనే కొత్త ఫీచర్ ను వాట్సాప్ ప్రారంభించింది. యూజర్లు దీని ద్వారా వివిధ ఏఐ పర్సనాలిటీలతో సంభాషించే వీలుంటుంది. ఇవి ఇంటరాక్షన్ ఫన్ ను యాడ్ చేస్తాయి. ఫేమస్ పర్సనాలిటీస్ నుంచి వివిధ వ్యక్తుల రోల్స్ ను ఈ పర్సనాలిటీలు కలిగి ఉంటాయి. మోటా ఏఐ చాట్ విండో ద్వారా మీరు ఈ ఫీచర్ ను యాక్సెస్ చేసుకోవచ్చు.

ఐఓఎస్ యూజర్ల కోసం వాట్సాప్ లో బిల్ట్ ఇన్ డయల్ ఫ్యాడ్ ఫీచర్ అందుబాటులోకి వచ్చింది. కాల్స్ ట్యాబ్ లోని ప్లస్ (+) ఐకాన్ ను ట్యాప్ చేయడం ద్వారా, వినియోగదారులు మొదట కాంటాక్ట్ లను సేవ్ చేయకుండానే నేరుగా ఫోన్ నంబర్లను డయల్ చేయవచ్చు.

యూజర్లు మెసేజ్ లను డబుల్ ట్యాప్ చేసి ఎమోజీలతో వేగంగా స్పందించవచ్చు. ఇన్ స్టాగ్రామ్ డీమ్ లో కనిపించే ఫీచర్ మాదిరిగానే ఇది ఉంటుంది. వినియోగదారులు రెస్పాన్స్ మోనూ ను తెరవడానికి సందేశాన్ని ట్యాప్ చేయవచ్చు. మీకు ఇష్టమైన ఎమోజీని ఎంచుకోవచ్చు.

కస్టమ్ ఫీచర్ ద్వారా గ్యాలరీలోని ఫొటోల నుంచి కస్టమ్ స్టిక్కర్లను రూపొందించడానికి ఈ ఫీచర్ ఎంతో ఉపయోగపడుతుంది. ఆటోమేటిక్ గా మీ ఇమేజ్ నుంచి సబ్జెక్ట్ ను కట్ చేసి స్టిక్కర్ గా మారుస్తుంది. స్టిక్కర్ స్పేస్ నుంచి నేరుగా లింక్ పంపడం ద్వారా మీరు స్టిక్కర్ ప్యాక్ లను ఇతరులతో పంచుకోవచ్చు.

వీడియో స్టేటస్ లకు బ్యాక్ గ్రౌండ్ ఎఫెక్టులు చేసుకునే అవకాశం ఇప్పటికే యూజర్లకు ఉంది. ఇప్పుడు దీన్ని ఫొటోలకు అందుబాటులోకి తీసుకువచ్చారు. ఫొటోలను పంపించే ముందు వివిధ ఎఫెక్టులు, ఫిల్టర్లను ఎంపిక చేసుకోవచ్చు.

ఆండ్రాయిడ్ వినియోగదారులకు టెక్ట్స్, మీడియా లేదా లింక్ లను ఫార్వార్డ్ చేసేటప్పుడు పర్సనలైజ్ సందేశాలను జోడించడాన్ని వాట్సాప్ సులభతరం చేసింది. ఈ ఆప్షన్ ఇప్పడు ఆండ్రాయిడ్ యూజర్లందరికీ అందుబాటులోకి వచ్చింది.