
సచిన్ టెండుల్కర్ పేరు తెలియని సగటు భారతీయుడు ఉండరనడంలో ఎలాంటి అతిశయోక్తిలేదు.

తన అసమాన ఆట తీరుతో టీమిండియాకు ఎన్నో విజయాలను అందించిన సచిన్... క్రికెట్ దేవుడిగా చరిత్రలోకెక్కాడు.

సచిన్ క్రికెట్‌కు వీడ్కోలు పలికి సుమారు ఎనిమిదేళ్లు గడుస్తోన్నా ఆయన సాధించిన కొన్ని రికార్డులు ఇప్పటికీ చెక్కు చెదరక పోవడం విశేషం. ఆయన పుట్టిన రోజు సందర్భంగా.. అలాంటి కొన్ని రికార్డులపై ఓ లుక్కేద్దాం..

అత్యధిక టెస్ట్ మ్యాచ్‌లు (200) ఆడిన ఏకైన క్రికెటర్.

టెస్ట్ మ్యాచ్‌ల్లో అత్యధిక పరుగులు సాధించిన ఏకైక బ్యాట్స్‌మెన్. (15921 పరుగులు)

అత్యధిక టెస్ట్ సెంచరీలు. (51), టెస్ట్‌ల్లో అత్యధిక ఫోర్లు (2058కిపైగా ఫోర్లు)

22 ఏళ్లపాటు వన్డే కెరీర్ కొనసాగించిన ప్లేయర్. ఏడాది కాలంలో అత్యధికంగా 1894 వన్డే పరుగులు సాధించిన ప్లేయర్.

అత్యధికంగా 145 వన్డే హాఫ్ సెంచరీలు, వన్డేల్లో అత్యధిక ఫోర్లు (2016)

20 మ్యాన్ ఆఫ్ ది సిరీస్‌లు. వన్డేల్లో అత్యధిక పరుగులు (34,357)