IPL చరిత్రలోనే అత్యధిక పరుగులు చేసిన టాప్‌ 5 బ్యాటర్లు వీరే! లిస్ట్‌లో ఒకే ఒక్క ఇండియన్‌

Updated on: Mar 16, 2025 | 5:09 PM

ఐపీఎల్‌ 2025 కోసం క్రికెట్‌ అభిమానులంతా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ నెల 22 నుంచి ఈ క్రికెట్‌ పండుగ మొదలు కానుంది. 2008లో మొదలైన ఐపీఎల్‌ ఈ ఏడాదితో 18వ సీజన్‌ను పూర్తి చేసుకోనుంది. అయితే ఇంత చరిత్ర కలిగిన ఈ ఐపీఎల్‌లో అత్యధిక స్కోర్ చేసిన టాప్‌ 5 ఆటగాళ్ల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం..

1 / 5
క్రిస్‌ గేల్‌.. అరివీర భయంకరమైన బ్యాటింగ్‌కు పెట్టింది పేరైన క్రిస్‌ గేల్‌ ఐపీఎల్‌లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్ల లిస్ట్‌లో నంబర్‌ వన్‌ ప్లేస్‌లో ఉన్నాడు. 2013 ఏప్రిల్‌ 23న రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు, పూణె వారియర్స్‌ ఇండియా మధ్య జరిగిన మ్యాచ్‌లో గేల్‌ 175 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. 66 బంతుల్లో 13 ఫోర్లు, 17 సిక్సర్లు బాదేశాడు.

2 / 5
బ్రెండన్‌ మెక్‌కల్లమ్‌.. ఈ న్యూజిలాండ్‌ సొగసరి ఆటగాడు ఐపీఎల్‌ ఆరంభ మ్యాచ్‌లోనే పరుగుల సునామీ సృష్టించాడు. 2008 ఏప్రిల్‌ 18న రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు, కోల్‌కతా నైట్‌ రైడర్స్‌ మధ్య ఐపీఎల్‌ ఫస్ట్‌ మ్యాచ్‌ జరిగింది. ఈ మ్యాచ్‌లో కేకేఆర్‌ తరఫున ఆడుతూ మెక్‌కల్లమ్‌ 158 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. 73 బంతుల్లో 10 ఫోర్లు, 13 సిక్సులతో 158 రన్స్‌ చేశాడు.

3 / 5
ఇక మూడో స్థానంలో సౌతాఫ్రికా ఆటగాడు క్వింటన్‌ డికాక్‌ ఉన్నాడు. ఐపీఎల్‌  2022లో కేకేఆర్‌తో జరిగిన మ్యాచ్‌లో లక్నో సూపర్‌ జెయింట్స్‌ తరఫున ఆడుతూ డికాక్‌ 140 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. ఆ మ్యాచ్‌లో 70 బంతుల్లో 10 ఫోర్లు, 10 సిక్సులతో 140 రన్స్‌ చేసి అదరగొట్టాడు. ఆ మ్యాచ్‌లో రాహుల్‌ కూడా 68 రన్స్‌ చేశాడు. ఎల్‌ఎస్‌జీ ఒక్క వికెట్‌ కూడా కోల్పోకుండా 210 పరుగులు చేసింది.

4 / 5
నాలుగో స్థానంలో సౌతాఫ్రికా దిగ్గజం, మిస్టర్‌ 360 ప్లేయర్‌ ఏబీ డివిలియర్స్‌ ఉన్నాడు. 2015 మే 10న ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆర్సీబీ తరఫున ఆడుతూ డివిలియర్స్‌ 133 పరుగులు చేసిన నాటౌట్‌గా నిలిచాడు. 59 బంతుల్లో 19 ఫోర్లు, 4 సిక్సర్లతో 133 రన్స్‌ సాధించాడు. అదే మ్యాచ్‌లో కోహ్లీ 50 బంతుల్లో 82 పరుగులు సాధించాడు. దీంతో ఆర్సీబీ ఒక్క వికెట్‌ మాత్రమే కోల్పోయి 235 పరుగుల భారీ స్కోర్ సాధించింది.

5 / 5
ఇక ఈ లిస్ట్‌లో టాప్‌ 5లో ఉన్న ఏకైక ఇండియన్‌ ప్లేయర్ కేఎల్‌ రాహుల్‌. రాహుల్‌ 2020లో ఆర్సీబీతో జరిగిన మ్యాచ్‌లో పంజాబ్‌ కింగ్స్‌ తరఫున ఆడుతూ 132 పరుగుల భారీ ఇన్నింగ్స్‌ ఆడి నాటౌట్‌గా నిలిచాడు. 69 బంతుల్లో 14 ఫోర్లు, 7 సిక్సులు బాదేశాడు.