
అయితే అరటి ఆకులపై గీతలు ఎందుకు ఉంటాయని అడిగితే, చాలా వరకు ప్రతి ఒక్కరూ కూడా, అన్ని ఆకులపై ఈ గీతలు ఉంటాయని సమాధానం ఇస్తారు. కానీ, అరటి ఆకులపై గీతలు ఉండటం వెనుక, శాస్త్రీయ, సహజ కారణాలు ఉన్నాయని చెబుతున్నారు నిపుణులు. కాగా ఇప్పుడు మనం దాని గురించి వివరంగా తెలుసుకుందాం.

చాలా వరకు అరటి ఆకులు పెద్దగా, వెడల్పుగా ఒక కాగితంలా ఉంటాయి. అయితే బలంగా గాలి వీచినప్పుడు, అవి విరిగిపోకకుండా ఇవి కాపాడుతాయంట. గాలి నిలువు గీతల వెంబడి ప్రయణిస్తుందంట. అందువలన ఇవి విరిగిపోకుండా బలంగా ఉంటాయి. అందుకే అరటి ఆకుల మధ్యలో ఉండే ఈ నిలువు గీతలను సహజ గాలి ప్రసరణ వ్యవస్థగా లేదా గాలి నిరోధకంగా పని చేస్తాయని చెబుతుంటారు.

ఇక శాస్త్రీయంగా చూస్తే, అరటి ఆకులోని ఈనెలు లేదా గీతలు, ఒక వ్యక్తి శరీరంలో ఉండే రక్తనాళాల మాదిరిగా పని చేస్తాయంట. అందువలన ఇవి చెట్టు వేర్ల నుంచి నీటిని, పోషకాలను , ఖనిజాలను ఆకులోని ప్రతి మూలకు తీసుకెళ్తాయంట, ఈ ఆకులు చాలా పెద్దగా ఉంటాయి కాబట్టి, వీటికి ఈనెలు ఉంటాయి, అవి నీటిని , పోషకాలను ఆకు ప్రతి మూలకు తీసుకెళ్తాయని చెబుతున్నారు నిపుణులు.

అంతే కాకుండా అరటి ఆకులో ఉండే ఈ గీతలకు మన పూర్వీకులు మరో కొత్త అర్థం కూడా కనుగొన్నారంట. అది ఏమిటి అంటే? ఈ గీతలు ఆహారాన్ని విభజించడానికి ఉపయోగపడేవంట. ఆకు మధ్య భాగంలో ఒక గీత ఉంటుంది. అయితే పైన గీత వెంబడి చట్నీ, ఊరగాయ, కర్రీలు వడ్డిస్తే, గీత కింద అన్నం, అప్పడం, పప్పు వంటివి వడ్డించేవారంట. ఇక ఈ ఆకులపై గీతలు ఉండటం వలన వీటిని మడిచినప్పుడు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉడేదంట. అలా కూడా ఈ గీతలు ఉపయోగపడేవి అంటున్నారు నిపుణులు.

నోట్ : ఈ వార్తలలో ఇవ్వబడిన సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. పాఠకుల ఆసక్తి మేరకు.. పలువురు పండితుల సూచనలు, వారి తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు