
శుక్ర గ్రహం సంపద, ప్రేమ, అందం, విలాసాలకు కారకుడు. ఎవరి జాతకంలో అయితే శుక్ర గ్రహం శుభస్థానంలో ఉంటుందో, వారికి అదృష్టం కలిసి వస్తుంది. అయితే కొన్ని సార్లు శుక్ర గ్రహ సంచారం కూడా లక్కు తీసుకొస్తుంది. మే8వ తేదీన శుక్ర గ్రహం మృగశిర నక్షత్రంలోకి సంచారం చేయనుంది. దీని వలన కొన్ని రాశుల వారికి ఊహించని విధంగా ప్రయోజనాలు చేకూరనున్నాయి. ఇంతకీ ఆ రాశులు ఏవో ఇప్పుడు చూద్దాం.

వృషభ రాశి : వృషభ రాశి వారికి శుక్ర గ్రహం నక్షత్ర సంచారం అన్ని విధాలుగా ప్రయోజనాలను చేకూరుస్తుంది. అప్పుల సమ్యల నుంచి త్వరగా బయటపడేలా చేస్తుంది. పెట్టుబడులు లాభదాయకంగా ఉంటాయి. అనుకున్న పనులను సమయానుగుణంగా పూర్తి చేస్తారు. నూతన వాహనం కొనుగోలు చేసే ఛాన్స్ ఉంది.

మిథున రాశి : మిథున రాశి వారికి ప్రేమ సంబంధ వ్యవహారాలు చాలా అద్భుతంగా ఉండనున్నాయి. వివాహాది ప్రయత్నాలు ఫలమిస్తాయి. ప్రమోషన్ వచ్చే ఛాన్స్ ఉంది. వ్యాపారం చేసేవారు అత్యధిక లాభాలు అందుకుంటారు. ఆర్థిక సమస్యలు అన్నీ తీరిపోయి, చాలా సంతోషంగా, ఆనందంగా జీవిస్తారు.

తుల రాశి : తుల రాశి వారికి పట్టిందల్లా బంగారమే అవుతుంది. అన్ని పనులను సమయానుగుణంగా పూర్తి చేస్తారు. ఇంటా బయట సంతోషకర వాతావరణం నెలకుంటుంది. ఉద్యోగాల్లో ప్రమోషన్ వచ్చే ఛాన్స్ ఉంది. ఆర్థికంగా కలిసి వస్తుంది.

కర్కాటక రాశి : శుక్ర సంచారం వలన కర్కాటక రాశి వారికి అద్భుతమైన ప్రయోజనాలు కలుగుతాయి. వీరి సంపద రెట్టింపు అవుతుంది. కొత్త వ్యక్తులతో పరిచయాలు భవిష్యత్తులో చాలా ఉపయోగకరంగా ఉంటాయి. ఆదాయం పెరగడంతో చాలా ఆనందంగా గడుపుతారు.