
చాలా మంది తలపు వెనుక చీపురు పెడుతుంటారు. కానీ వాస్తు శాస్త్రం ప్రకారం ఇది అస్సలే మంచిదికాదంట. దీని వలన అనేక సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుందని చెబుతున్నారు వాస్తు శాస్త్ర నిపుణులు. ఇది ఆర్థిక సమస్యలకు కారణం అవుతుందంట. అందుకే వీలైనంత వరకు తలపుల వెనుక చీపురు పెట్టకూడదు అని చెబుతున్నారు పండితులు.

అలాగే చాలా మంది ఆఫీసు నుంచి ఇంటికి రాగానే తలపు వెనుక ఉండే హుక్స్‌కు విడిచిన పాత బట్టలు తగిలించడం చేస్తుంటారు. కానీ ఇది అస్సలే మంచిదికాదంట, ఇది ఇంటిలో ప్రతి కూల శక్తిని పెంచుతుందని చెబుతున్నారు వాస్తు శాస్త్ర నిపుణులు. ఇలా విడిచిన బట్టలు ఆరేయ్యడం వలన ఇంటిలో మానసిక ప్రశాంతత దెబ్బతింటుంది. అలాగే అనారోగ్య సమస్యలు ఎక్కువ అవుతాయంట.

అదే విధంగా కొందరు పాత క్యాలెండర్స్ ఇంటి తలపులకు వెనుక సైడ్ తగిలిస్తుంటారు. కానీ ఇది కూడా మంచిదికాదంట. ఇలా పాత కాలం చెల్లిన క్యాలెండర్స్‌ను ఇంటిలోని డోర్ వెనక వేయడం వలన ఇది ఆర్థిక సమస్యలు, వృత్తిపరమైన ఎదుగుదలను అడ్డుకుంటుందంట. అందుకే ఎట్టి పరిస్థితుల్లోనూ పాత క్యాలెండర్స్ ఇంటి డోర్ వెనక సైడ్ వేయకూడదు.

ఇవే కాకుండా స్నానం చేసిన తర్వాత తడి తువ్వాలా, తడి క్లాత్స్, తలపుల వెనక వేయడం కూడా మంచిదికాదంట. దీని వలన రాహు, కేతు ప్రభావం పడుతుందంట. ఇది దంపతులు మధ్య మనస్పర్థలు, అపార్థాలు, బంధంలో చీలిక, దూరం వంటి ఇబ్బందులు తలెత్తుతాయి. అందుకే ఎప్పుడూ కూడా తడి బట్టలు డోర్ వెనక సైడు వేయకూడదు.

నోట్ : ఈ వార్తలలో ఇవ్వబడిన సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. పాఠకుల ఆసక్తి మేరకు.. పలువురు పండితుల సూచనలు, వారి తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు.