
శని మీన రాశిలో సంచారం చేస్తుంది. దీని వలన నాలుగు రాశుల వారు ఆర్థిక సమస్యలు, మానసిక ఒత్తిడికి లోను అవ్వడం, అనారోగ్య సమస్యలు అధికం అవ్వడం వంటి అనేక సమస్యలు ఎదుర్కోనున్నారు. కాబట్టి నాలుగు రాశుల వారు ఆరు నెలల పాటు ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిదని చెబుతున్నారు పండితులు. ఇంతకీ ఆ రాశులు ఏవో ఇప్పుడు చూసేద్దాం.

మీన రాశి : ఏలినాటి శని ప్రభావం మీన రాశి వారిపై చాలా ఎక్కువగా ఉంటుంది. ముఖ్యంగా వ్యాపారస్తులు, రియలెస్టేట్ రంగంలో ఉన్నవారు అనేక ఇబ్బందులు ఎదుర్కుంటారు. ఆందోళనకర పరిస్థితులు ఎదురు అవుతాయి. ఏ పని చేసినా ఆలోచించి చేయడం చాలా ముఖ్యంగా. చిన్న చిన్న తప్పులే పెద్ద పెద్ద సమస్యలకు కారణం అయ్యే చాన్స్ ఉందని పండితులు తెలియజేస్తున్నారు.

కుంభ రాశి : ఈ రాశి వారు అనేక సమస్యలు ఎదుర్కుంటారు. .ముఖ్యంగా కుటుంబం విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎప్పుడూ కూడా తొందరపాటు నిర్ణయాలు తీసుకోకూడదు. అలాగే మీ మాటలు ఎంత అదుపులో ఉంటే మీకు అంత మంచిది. ఆర్థికంగా కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. మీరు డబ్బులు ఖర్చు పెడితే అది మీకు సమస్యలు తీసుకొస్తుంది. అంతా బాగుండాలి అంటే శని వారం రోజున నల్ల వస్తువులు దానం చేయడం చాలా మంచిది.

మేష రాశి : మేష రాశి వారికి ఓర్పు, సహనం చాలా అవసరం, వీరు ఏ పని చేసినా ఒకటికి రెండు సార్లు ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి. ముఖ్యంగా భాగస్వామ్య వ్యాపారం చేసే వారు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆర్థిక లాభాల కోసం ఎలాంటి నిర్ణయం తీసుకున్నా అది మీకు అన్నివిధాలుగా సమస్యలనే తీసుకొస్తుంది. చాలా వరకు అన్ని విషయాల్లో ఆచీ తూచి అడుగులు వేయడం చాలా అవసరం.

నోట్ : ఈ వార్తలలో ఇవ్వబడిన సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. పాఠకుల ఆసక్తి మేరకు.. పలువురు పండితుల సూచనలు, వారి తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు