
ముఖ్యంగా ఇది పన్నెండు రాశులపై దాని ప్రభావం చూపుతుంది. ఈ సమయంలో కొన్ని రాశుల వారికి అప్పుల సమస్యలు తీరిపోవడం,వ్యాపారంలో నష్టాలు ఎదుర్కున్నవారికి లాభాలు రావడం జరుగుతుందంట. కాగా, ఈ పౌర్ణమి ఎవరికి మేలు చేస్తుందో ఇప్పుడు చూద్దాం.

తుల రాశి :పౌర్ణమి తర్వాత మీ జాతకంలో శుక్ర బలం పెరుగుతోంది. ఆర్థిక ఇబ్బందులన్నీ తొలగిపోతాయి. చాలా కాలంగా రావాల్సిన డబ్బు చేతికి అందుతుంది. ఉద్యోగంలో మీ టాలెంట్ కి గుర్తింపు వచ్చి జీతం పెరిగే అవకాశం ఉంది. ప్రేమ విషయంలో శుభవార్త వింటారు. అదే విధంగా ఎవరు అయితే ప్రభుత్వ ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తున్నారో వారు ఈ సారి తప్పకుండా జాబ్ సాధిస్తారు

మీన రాశి : గురు గ్రహ సంచారం మీకు అత్యంత అనుకూలంగా ఉంది. ఈ పౌర్ణమి మీ జీవితంలో కొత్త వెలుగులు నింపుతుంది. వ్యాపారం చేసేవారికి భారీ లాభాలు వస్తాయి. నిరుద్యోగులకు మంచి ఉద్యోగం వచ్చే యోగం ఉంది. ఇంట్లో శుభకార్యం జరిగే సూచనలు కనిపిస్తున్నాయి. ఆర్థికంగా కలిసి వస్తుంది. అప్పుల బాధల నుంచి బయటపడతారు.

కుంభ రాశి : శని ప్రభావం తగ్గి, మీకు మహారాజయోగం పట్టబోతోంది. పౌర్ణమి తర్వాత మీరు ఏ పని మొదలుపెట్టినా విజయం మీదే. అప్పులు తీరిపోతాయి, ఆస్తి వివాదాలు పరిష్కారం అవుతాయి. కొత్త వాహనం, కొత్త ఇల్లు కొనే అవకాశం బలంగా ఉంది. ఆరోగ్యం కూడా చాలా బాగుంటుంది. కుటుంబంలో సంతోషకర వాతావరణం నెలకుంటుంది.

నోట్ : ఈ వార్తలలో ఇవ్వబడిన సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. పాఠకుల ఆసక్తి మేరకు.. పలువురు పండితుల సూచనలు, వారి తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు