
జ్యోతిష్య శాస్త్రంలోని హస్త సాముద్రిక శాస్త్రం ద్వారా అరచేతిలో ఈ రేఖల ద్వారా కూడా భవిష్యత్తు, కెరీర్ గురించి తెలుసుకోవచ్చును. అయితే చేతిలో పర్వత రేఖ, సూర్య రేఖ, విజయ రేఖ ఇలా అనేక రేఖలు ఉంటాయి. అయితే ప్రభుత్వ ఉద్యోగం రాసి పెట్టి ఉందా? లేదా అనేది ఎలా తెలుసుకోవాలో ఇప్పుడు చూద్దాం.

అర చేతిలో సూర్య పర్వతం, గురు పర్వతం రెండూ చాలా ముఖ్యమైనవి. అయితే హస్త సాముద్రిక శాస్త్రం ప్రకారం, గురు, సూర్య పర్వతాలపై ఉన్న కొన్ని చిన్న చిన్న గుర్తులు గల రేఖలు మీకు ప్రభుత్వ ఉద్యోగం రాసి పెట్టి ఉందో లేదో తెలియజేస్తాయంట. కాగా, ఇంతకీ ఆ రేఖలు ఏవో ఇప్పుడు మనం తెలుసుకుందాం.

ఎవరికి అయితే అరచేతిలో సూర్య పర్వతం పై చిన్న చిన్న గీతల మధ్య చతురస్రాకారం కనిపిస్తే అది చాలా అదృష్టం. ఎవరికి అయితే సూర్య పర్వతంపై చతురస్రాకారం ఉంటుందో, వారికి ప్రభుత్వ ఉద్యోగం తప్పకుండా వస్తుందని చెబుతున్నారు హస్త సాముద్రిక శాస్త్ర నిపుణులు.

అదే విధంగా గురు పర్వతంపై త్రిభుజ కారం గుర్తు ఉన్నా కూడా చాలా మంచిదంట. వీరికి కూడా అన్ని విధాలుగా ముఖ్యంగా ప్రభుత్వ ఉద్యోగం పొందే ఛాన్స్ చాలా ఎక్కువగా ఉంటుందంట. అంతే కాకుండా ఇలాంటి గుర్తు ఉన్నవారు, సమాజంలో గుర్తింపు సంపాదించుకుంటారంట.

నోట్ : ఈ వార్తలలో ఇవ్వబడిన సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. పాఠకుల ఆసక్తి మేరకు.. పలువురు పండితుల సూచనలు, వారి తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు