
అక్టోబర్ నెలలో లక్ష్మీనారాయణ రాజయోగం ఏర్పడనుంది. అక్టోబర్ 6న శుక్రుడు, అక్టోబర్ 21న బుధుడు తుల రాశిలో ప్రవేశిస్తాడు. అయితే ఈ తుల రాశిలో శుక్ర గ్రహం, బుధ గ్రహం వక్ర గమనం వలన లక్ష్మీ నారాయణ యోగం ఏర్పడుతుంది. ఇది పన్నెండు రాశుల పై ప్రభావం చూపగా మూడు రాశుల వారికి లక్కు తీసుకొస్తుంది.

కుంభ రాశి : కుంభ రాశి వారికి ఇది అద్భుతమైన సమయం. ఆర్థికంగా కలిసి వస్తుంది. చాలా రోజుల నుంచి ఎవరు అయితే అప్పుల బాధతో సతమతం అవుతున్నారో వారికి ఇది మంచి సమయం. అప్పుల బాధ నుంచి బయట పడతారు. అంతే కాకుండా ఆదాయం కూడా పెరుగుతుంది. ఈ రాశి వారికి చాలా వరకు అద్భుతమైన ప్రయోజనాలు చేకూరుతాయి.

మకర రాశి : మకర రాశి వారికి చాలా అద్భుతంగా ఉంటుంది. ఆదాయం పెరుగుతుంది. సమాజంలో వీరికి అంటూ ప్రత్యేక గుర్తింపు లభిస్తుంది. అనుకున్న పనులను చాలా త్వరగా పూర్తి చేసుకుంటారు. ఆదాయం డబుల్ అవుతుంది. కుటుంబంలో కూడా సంతోషకర వాతావరణం నెలకుంటుంది. అన్నివిధాలుగా వీరికి ఇది మంచి సమయం అని చెప్పాలి.

తుల రాశి : తుల రాశి వారికి ప్రతి పనిలో విజయం ఎదురు అవుతుంది. అనుకోకుండా ఆకస్మిక ధన లాభం కలుగుతుంది. దూరప్రయాణాలు చేయాల్సి వస్తుంది. ఇవి వీరికి చాలా సంతోషాన్ని ఇస్తాయి. అంతే కాకుండా విదేశీ ప్రయాణాలు లాభదాయకంగా ఉన్నాయి. వ్యాపారస్తులు ఎక్కువ మొత్తంలో డబ్బు పొదుపు చేసుకుంటారు. అన్నివిధాలుగా వీరికి కలిసి వస్తుంది.

నోట్ : ఈ వార్తలలో ఇవ్వబడిన సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. పాఠకుల ఆసక్తి మేరకు.. పలువురు పండితుల సూచనలు, వారి తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు