
మనీ ప్లాంట్ లేని ఇల్లే లేదు. చాలా మంది తమ ఇంటిలో మనీ ప్లాంట్ మొక్కను నాటుకుంటున్నారు. ఇది వాస్తు ప్రకారం కలిసి వస్తుంది అంతే కాకుండా, ఎవరి ఇంటిలో అయితే మనీ ప్లాంట్ మొక్క ఉంటుందో వారికి ఆర్థిక సమస్యలు ఉండవు అని అంటారు. అందుకే చాలా మంది తమ ఇంటి ముందు మనీ ప్లాంట్ మొక్కను నాటుకుంటున్నారు.

అయితే మనీ ప్లాంట్ మొక్క నాటడం మంచిదే అయినప్పటికీ, దానిని నాటే సమయంలో తప్పకుండా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలని చెబుతున్నారు నిపుణులు. చాలా మంది రోజుతో సంబంధం లేకుండా మనీ ప్లాంట్ మొక్కను నాటుతుంటారు. అందువలన ఎప్పుడూ కూడా శుక్రవారం రోజున మనీ ప్లాంట్ మొక్కను నాటాలంట. దీని వలన అన్ని విధాలుగా కలిసి వస్తుంది.

అంతే కాకుండా, మనీ ప్లాంట్ నాటే సమయంలో కూడా తప్పకుండా సరైన దిశలో మాత్రమే నాటాలి. ఎప్పుడు కూడా మనీ ప్లాంట్‌ను మీ ఇంటిలో ఆగ్నేయ దిశలో ఉంచడం చాలా మంచిది. దీని వలన ఇంటిలో ఉన్న ప్రతి కూల శక్తి తొలిగిపోతుంది. సంపద పెరుగుతుంది. అన్ని విధాలుగా మీకు ఆర్థిక ప్రయోజనాలు చేకూరుతాయి.

కొంత మంది తెలిసి తెలియక మనీ ప్లాంట్ మొక్కను ఈశాన్యం దిశలో నాటుతుంటారు. కానీ ఇలా ఈశాన్యంలో మనీ ప్లాంట్ మొక్కను నాటడం అస్సలే మంచిది కాదు అని చెబుతున్నారు పండితులు. దీని వలన ఆర్థిక, అప్పుల బాధలు ఎక్కువ అవుతాయంట. అంతే కాకుండా చాలా నష్టాలు ఎదుర్కోవాల్సి వస్తుందంట. అందువలన వీలైనంత వరకు ఈశాన్యంలో మనీ ప్లాంట్ మొక్క నాటకూడదు.

నోట్ : ఈ వార్తలలో ఇవ్వబడిన సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. పాఠకుల ఆసక్తి మేరకు.. పలువురు పండితుల సూచనలు, వారి తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు