
మే 15న సూర్యుడు తన రాశి మార్చుకోనున్నారు. ఇప్పటి వరకు మేష రాశిలో సంచారం చేస్తు్న్న సూర్యుడు త్వరలో వృషభ రాశిలోకి ప్రవేశించనున్నాడు. దీని వలన మే 15 నంచి నాలుగు రాశుల జీవితం కొత్త మలుపు తిరుగుతుంది. ముఖ్యంగా వీరికి పట్టింది బంగారమే, ముట్టింది ముత్యమే అవుతుంది. అన్ని విధాలుగా కలిసి వస్తుంది.

మేష రాశి : మేష రాశి వారికి చాలా అద్భుతంగా ఉంది. వీరికి అన్ని విధాలుగా కలిసి వస్తుంది. సూర్య సంచారం వలన పనుల్లో ఆటంకాలు తొలిగిపోతాయి. చాలా రోజుల నుంచి ఎవరు అయితే డబ్బు కోసం ఇబ్బంది పడుతున్నారో వారికి సమయానికి డబ్బు చేతికి అందుతుంది. ఆనందకర జీవితాన్ని గడుపుతారు. ఇంటా బయట సంతోషకర వాతావరణం నెలకుంటుంది.

కన్యా రాశి : కన్యా రాశి వారికి వాహన యోగం ఉంది. రాశి వారు త్వరలో కొత్త వాహనం లేదా స్థిరాస్తి కొనుగోలు చేస్తారు. ఆర్థిక సమస్యలు తొలిగిపోతాయి. ఆరోగ్యం కూడా కుదుట పడుతుంది. చాలా రోజుల నుంచి ఎవరు అయితే ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్నారో, వారికి త్వరలోనే మంచి జాబ్ దొరుకుతుంది. అంతే కాకుండా విదేశీ ప్రయాణం చేసే యోగం కూడా ఉంది.

తుల రాశి : తుల రాశి వారికి ఇది చాలా బెస్ట్ టైమ్ అని చెప్పాలి. ఆదాయం పెరుగుతుంది. అనుకోకుండా దూర ప్రయాణాలు చేయాలి వస్తుంది. ఇవి మీకు చాలా లాభాలను తీసుకొస్తాయి. మీ సంతానం నుంచి శుభ వార్తలు వింటారు. నిరుద్యోగులకు మంచి ఉద్యోగం లభిస్తుంది. అవసరానికి డబ్బు చేతికి అందుతుంది. అన్ని విధాలుగా కలిసి వస్తుంది.

వృశ్చిక రాశి : వృశ్చిక రాశి వారికి మొండి బాకీలు వసూలు అవుతాయి. అలాగే కోర్టు వ్యవహారాలు మీకే అనుకూలంగా వస్తాయి. చాలా రోజుల నుంచి పెండింగ్‌లో ఉన్న పనులను చాలా త్వరగా పూర్తి చేస్తారు. సమాజంలో మీకంటూ ప్రత్యేక గుర్తింపు లభిస్తుంది. వ్యాపారులు కూడా ఎక్కువ లాభాలను అందుకుంటున్నారు.