మామిడి పండు తింటున్నట్లు కల వచ్చిందా.. అయితే మీ పంట పండినట్లే!

Updated on: Apr 11, 2026 | 4:18 PM

జ్యోతిష్య శాస్త్రంలో స్వప్నశాస్త్రానికి చాలా ప్రత్యేక ప్రాముఖ్యత ఉంటుంది. ప్రతి ఒక్కరూ కలలు కంటారు. ఒకొక్కరికీ ఒక్కో విధంగా కలలు వస్తుంటాయి. అయితే కొంత మంది పూర్వీకులు, పువ్వులు, దేవతలు, పాములు కనిపిస్తే మరికొంత మందికి పూలు, పండ్లు కొబ్బరికాయలు ఇలాంటివి కలలో కనిపిస్తాయి. ముఖ్యంగా ప్రెగ్నెంట్ ఉన్నవారికి కలలో మామిడి పండు కనిపిస్తే కొడుకు పుడతారని అంటారు పెద్దవారు. కాగా, ఇప్పుడు మనం దీని గురించి వివరంగా తెలుసుకుందాం.

1 / 5
స్వప్నశాస్త్రం ప్రకారం ప్రతి కలకు ఒక అర్థం ఉంటుంది.  కొన్ని కలలు నిజం అవుతే, కొన్ని కలలు కలలగానే మిగిలిపోతాయి. అయితే కలలో కొంత మందికి మామిడి చెట్టు లేదా మామిడి పండు, మామిడి కాయ కనిపించడం సహజం. అయితే ఇలా కలలో మామిడిపండు కనిపించడం చాలా మంచిదంట.

2 / 5
ఎవరికి అయితే కలలో మామిడి పండు లేదా మామిడి చెట్టు కనిపిస్తుందో వారికి అదృష్టం కలిసి వస్తుందని చెబుతున్నారు జ్యోతిష్య శాస్త్ర నిపుణులు. ముఖ్యంగా మామిడి పండు కలలో ఏ రకంగా కనిపించినా అది శుభఫలితాలనే ఇస్తుందంట.కొంత మందికి కలలో పండు మామిడి పండు తింటున్నట్లు కనిపిస్తుంది. అయితే ఇలా కనిపించడం చాలా శుభప్రదం అంటున్నారు స్వప్నశాస్త్ర నిపుణులు. పండిన మామిడి పండు తింటున్నట్లు కల రావడం వలన భవిష్యత్తులో ఇది వృద్ధి సూచిస్తుందంట. అంతే కాకుండా అతి త్వరలో మీ సంపద పెరుగుతుందనే సూచన.

3 / 5
 అంతే కాకుండా ముఖ్యంగా గర్భిణీలకు కలలో మామిడి పండు కనిపించడం చాలా శుభ ప్రదం అంటారు స్వప్నశాస్త్ర నిపుణులు. గర్భిణీలకు కలలో మామిడి పండు కనిపించడం వలన కొంత మంది  అదృష్టం కలిసి వస్తుందని చెబితే, మరొకొంత మంది   ప్రెగ్నెంట్‌తో ఉన్నవారికి కలలో మామిడి పండు కనిపిస్తే కొడుకు పుడతారు అని చెబుతుంటారు.

4 / 5
ముఖ్యంగా ఇప్పటికీ పెద్దవారు గర్భిణీలకు కలలో మామిడి పండు కనిపించింది అంటే కొడు జన్మిస్తాడని చెప్తారు. అంతే కాకుండా జామకాయ కలలో కనిపిస్తే అబ్బాయి, బెండకాయ కలలో కనిపిస్తే అమ్మాయి, సీతాఫలం కలలో కనిపించినా అమ్మాయి పుడుతుందని చెబుతుంటారు. అయితే కొంత మంది వీటిని నమ్మితే,మరికొంత మంది మాత్రం ఇవన్నీ మూఢనమ్మకాలు అని కొట్టిపారేస్తుంటారు.

5 / 5
నోట్ : ఈ వార్తలలో ఇవ్వబడిన సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. పాఠకుల ఆసక్తి మేరకు.. పలువురు పండితుల సూచనలు, వారి తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు

Follow Us