లక్కీ వెదురు ఇంటిలో ఉంటే అదృష్టమే అదృష్టం.. కానీ ఎన్ని కొమ్మలు ఉండాలో తెలుసా?

Updated on: Apr 25, 2026 | 1:55 PM

లక్కీ వెదురు మొక్క గురించి చెప్పాల్సిన పని లేదు. చాలా మంది తమ ఇంటిలో ఈ మొక్కను నాటుకుంటారు. వాస్తు శాస్త్రం ప్రకారం ఇంటిలో లేదా ఆఫీసులో లక్కీ వెదురు మొక్కను నాటుకోవడం వలన అదృష్టం కలిసి వస్తుంది. ఇది ఇంటిలో సంపదను పెంచడమే కాకుండా ఆర్థికాభివృద్ధికి కూడా దోహదం చేస్తుందంట. అందుకే చాలా మంది తమ ఇంటి వద్ద లక్కీ వెదురు నాటుకుంటారు. అయితే ఇది ఇంటిలో పెట్టుకునే సమయంలో తప్పకుండా వాస్తు ప్రకారం కొన్ని నియమాలు పాటించాలంట. అవి ఏవో ఇప్పుడు చూద్దాం.

1 / 5
చాలా మంది తమ ఇంటిలో అనేక రకాల మొక్కలు నాటుకుంటారు. ముఖ్యంగా ఈ మధ్య కాలంలో ఎక్కువగా వాస్తు ప్రకారం, అదృష్టం కలిసి రావాలి అని మనీ ప్లాంట్, ఫెంగ్ షూయ్, స్నేక్ ప్లాంట్, లక్కీ వెదురు ఇలాంటి మొక్కను నాటుకుంటున్నారు. అయితే ఇంటిలో ప్రతి కూల శక్తిని తొలిగించడంలో లక్కీ వెదురు అద్భంగా పని చేస్తుంది. మరి ఇది ఎన్ని కొమ్మలు ఉన్న దాన్ని నాటుకోవడం మంచిది?  ఏ సంఖ్య ఎలాంటి ప్రభావాన్ని చూపుతుందో వివరంగా తెలుసుకుందాం.

2 / 5
మీరు గనుక మీ ఇళ్లు లేదా ఆఫీసులో లక్కీ వెదురు పెట్టుకోవాలి అనుకుంటే, ఎట్టి పరిస్థితుల్లో నాలుగు కొమ్మలు ఉన్నదాన్ని పెట్టుకోకూడదంట. ఇది చాలా అశుభం, ఈ సంఖ్య మరణాన్ని సేూచిస్తుందంట. అందుకే దీని విషయంలో చాలా జాగ్రత్త వహించాలంట.

3 / 5
ఇక ఒక కొమ్మ ఉన్న మొక్కును నాటుకోవడం మంచిది. ఇది అనేక శుభ ఫలితాలను ఇస్తుందంట. అంతే కాకుండా ఒక కొమ్మ మొక్కను నాటుకోవడం వలన ఇది వ్యాపారంలో వృద్ధిని సూచిస్తుంది.అలాగే కెరీర్ పురోగతిని సూచిస్తుంది. అందువలన ఒక కొమ్మ ఉన్న లక్కీ వెదురు మొక్కను విద్యార్థులు తమ స్టడీ రూమ్‌లో ఉంచుకోవడం మంచిదంట.

4 / 5
ఇక రెండు కొమ్మలు ఉన్న వెదురు మొక్క ప్రేమకు చిహ్నం. ఇది భార్య భర్తల మధ్య బంధం లేదా, వ్యాపారస్తుల మధ్య మంచి సంబంధాలు, కుటుంబంలోని ప్రేమానురాగాలకు చిహ్నం. అయితే ఇలా రెండు కొమ్మలు ఉన్న మొక్కను ముఖ్యంగా దంపతులు తమ బెడ్ రూమ్‌లో ఉంచుకోవడం మంచిదంట. ఇది ఇద్దరి మధ్య ఉన్న ప్రతికూలతలను తొలిగించి, ప్రేమను నింపుతుందంట.

5 / 5
 అదే విధంగా మూడు కొమ్మలు ఉన్న వెదురు మొక్క, సంతోషం, ఆనందం, ఆరోగ్యం, కుటుంబ శ్రేయస్సు, ఇంటిలో సానుకూలత, అదృష్టానికి సంకేతం. కాబట్టి దీనిని లివింగ్ రూమ్‌లో పెట్టుకోవడం మంచిది. అలాగే ఐదు కొమ్మలు ఉన్న లక్కీ వెదురు విజయానికి గుర్తు, ఇది ఆఫీసులో పెట్టుకోవడం మంచిది. అదే విధంగా ఎనిమిది కొమ్మలు ఉన్న లక్కీ వెదురు అదృష్టాన్ని, సంపద వృద్ధిని సూచిస్తుంది. (Disclaimer: ఇక్కడ అందించిన సమాచారం జ్యోతిష శాస్త్రం, సాధారణ నమ్మకాల ఆధారంగా మాత్రమే అందించబడింది. ఈ సమాచారం ఖచ్చితంగా నిజం లేదా శాస్త్రీయంగా నిర్ధారితమైన సమాచారం అని భావించకండి. వ్యక్తిగత నిర్ణయాలు తీసుకునే ముందు సంబంధిత నిపుణులను సంప్రదించడం మంచిది)

Follow Us