దిష్టి పోవాలంటే బూడిద గుమ్మడికాయ ఇలా ఉండాలట.. కట్టే రోజు కూడా ముఖ్యమే!

Updated on: May 21, 2026 | 7:09 PM

Ash Gourd Benefits: ఇల్లు నిర్మించినప్పుడు లేదా కొత్త వ్యాపారం ప్రారంభించిన సమయంలో చాలామంది దిష్టి ప్రభావం లేకుండా ఉండాలని ఇంటి, దుకాణాల ముందు బూడిద గుమ్మడికాయను కడతారు. సంప్రదాయ విశ్వాసాల ప్రకారం ఇది నరదిష్టి, కనుదిష్టి వంటి ప్రతికూల శక్తులను దూరం చేస్తుందని భావిస్తారు.

1 / 6
ఇల్లు కట్టినా, కొత్త వ్యాపారం ప్రారంభించినా చాలామంది దిష్టి దూరంగా ఉండాలని ఇంటి లేదా దుకాణం ముందు బూడిద గుమ్మడికాయను వేలాడదీస్తారు. ప్రజల నమ్మకం ప్రకారం ఇది నరదిష్టి, కనుదిష్టి వంటి ప్రతికూల ప్రభావాలను తగ్గిస్తుందని భావిస్తారు. అయితే దీనికి ఉపయోగించే గుమ్మడికాయను ఎలా ఎంపిక చేయాలి, ఎలా కట్టాలి అనే విషయాల్లో కొన్ని సంప్రదాయ నియమాలు పాటిస్తారు.

2 / 6
దిష్టి కోసం తీసుకువచ్చే బూడిద గుమ్మడికాయను కడగకూడదని పెద్దలు చెబుతారు. కడిగితే దాని శక్తి తగ్గిపోతుందని నమ్మకం. కాబట్టి కడగకుండా గుమ్మడికాయపై పసుపు రాసి, కుంకుమ బొట్లు పెట్టి ఇంటి ముందు కట్టడం మంచిదని సూచిస్తారు.

3 / 6
అలాగే తొడిమ ఊడిపోయిన గుమ్మడికాయను ఉపయోగించరాదని చెబుతారు. ఇంటికి తీసుకొచ్చే సమయంలో తొడిమ పట్టుకుని ఎత్తడం లేదా తలకిందులుగా తిప్పడం వల్ల అది ఊడిపోవచ్చు. అలా అయితే దాని శుభప్రభావం తగ్గిపోతుందని నమ్మకం. అందుకే గుమ్మడికాయను ఎప్పుడూ తొడిమ పైవైపు ఉండేలా జాగ్రత్తగా తీసుకురావాలని సూచిస్తారు.

4 / 6
గుమ్మడికాయను కట్టే రోజుకూ ప్రత్యేక ప్రాధాన్యం ఉందని విశ్వసిస్తారు. ముఖ్యంగా అమావాస్య రోజున కడితే మంచి ఫలితాలు ఉంటాయని అంటారు. ఆ రోజున కట్టడం వల్ల నరదిష్టి, కనుదిష్టి రెండూ తొలగిపోతాయని నమ్మకం. అమావాస్య రోజున వీలు కాకపోతే బుధవారం లేదా శనివారం రోజున కూడా కట్టవచ్చని చెబుతారు.

5 / 6
ఏ రోజున కట్టినా సూర్యోదయానికి ముందే గుమ్మడికాయను వేలాడదీయడం శ్రేయస్కరమని భావిస్తారు. సూర్యోదయం తరువాత కడితే పూర్తి ప్రయోజనం ఉండదని, మిశ్రమ ఫలితాలు ఉండొచ్చని పెద్దలు చెబుతారు.

6 / 6
గుమ్మడికాయను కట్టే ముందు ఒక పెద్ద ప్లేటులో పెట్టి పసుపు రాసి, కుంకుమ బొట్లు పెట్టి ఆ తరువాత ఇంటి లేదా దుకాణం ముందు వేలాడదీయడం సంప్రదాయంగా పాటించే విధానం.

(Disclaimer: ఇక్కడ అందించిన సమాచారం జ్యోతిష్యం, వాస్తు, సాధారణ నమ్మకాల ఆధారంగా మాత్రమే అందించబడింది. ఈ సమాచారం ఖచ్చితంగా నిజం లేదా శాస్త్రీయంగా నిర్ధారితమైన సమాచారం అని భావించకండి. వ్యక్తిగత నిర్ణయాలు తీసుకునే ముందు సంబంధిత నిపుణులను సంప్రదించడం మంచిది.)

గుమ్మడికాయను కట్టే ముందు ఒక పెద్ద ప్లేటులో పెట్టి పసుపు రాసి, కుంకుమ బొట్లు పెట్టి ఆ తరువాత ఇంటి లేదా దుకాణం ముందు వేలాడదీయడం సంప్రదాయంగా పాటించే విధానం. (Disclaimer: ఇక్కడ అందించిన సమాచారం జ్యోతిష్యం, వాస్తు, సాధారణ నమ్మకాల ఆధారంగా మాత్రమే అందించబడింది. ఈ సమాచారం ఖచ్చితంగా నిజం లేదా శాస్త్రీయంగా నిర్ధారితమైన సమాచారం అని భావించకండి. వ్యక్తిగత నిర్ణయాలు తీసుకునే ముందు సంబంధిత నిపుణులను సంప్రదించడం మంచిది.)

Follow Us