
వినాయక చవితి సెలబ్రేషన్స్ మొదలు అయ్యాయి. ప్రతి వాడ వాడలో మండపాలు రెడీ అయ్యి, వినాయకుడి రాక కోసం ఎదురు చూస్తున్నాయి.సెప్టెంబర్ 14న వినాయకుడి ప్రతిష్టపాన జరగనుంది. ఇక వినాయకుడి పూజ సమయంలో లేదా సహజంగా చాలా మంది గణనాథుడి ముందు గుంజీలు తియ్యడం చూస్తుంటం.

ఇక మన పెద్ద వారు చెబుతుంటారు వినాయకుడి ముందు గుంజీలు తియ్యడం వలన కోరిన కోరికలు నెరవేరుతాయని. మరి ఇలా వినాయకుడి ముందు గుంజీలు తియ్యడం వలన కోరిన కోరికలు నెరవేరుతాయంట. అవును అనే అంటున్నారు పండితులు. ముఖ్యంగా వినాయకుడి ముందు గుంజీలు తియ్యడం వెనక మూడు కారణాలు ఉన్నాయంట.

అందులో ఒకటి, అహంకారాన్ని వదిలిపెట్టడం. వినాయకుడి ముందు గుంజీలు తియ్యడం అంటే, నా అహంకారాన్ని వదిలి వేస్తున్నాను అని అర్థం. అంటే నీ అహాన్ని వదిలి నువ్వు దేవుడిని ప్రార్థించడం. నువ్వు తగ్గినప్పుడే నీకు దేవుడు అన్నీ ఇస్తాడు. అందువలన నీ అహకారాన్ని పక్కన పెట్టి కోరికను కోరడం వలన ఆ కోరిక నెరవేరుతుంది అంటారు.

గుంజీలు తియ్యడం వెనకున్న అసలు సీక్రెట్ ఇదే, అమెరికాలో దీనినే సూపర్ బ్రేయిన్ యోగా అంటారు. చెవులు పట్టుకొని గుంజీలు తీస్తే మన మెదడుకి రక్త ప్రసరణ జరిగి, మెమోరీ పవర్ 3 రేట్లు పెరుగుతుందంట. దీని వలన జ్ఞాపక శక్తి కూడా పెరుగుతుంది.

అలాగే మూడో కారణం విషయానికి వస్తే, మనం కోరిక నెరవేరితే రోజూ 21 గుంజీలు తీస్తామని మొక్కుకుంటాం. ఇలాంటి సమయంలో మీ మైండ్ ఆటోమేటిక్‌గా ఆ కోరిక మీదే ఫోకస్ అవుతుంది. అంటే మీరు గుంజీలు తీసే సమయంలో సంకల్పం, నమ్మకం, ప్రయత్రం ఈ మూడు చేస్తు్న్నారు. ఈ మూడు ఉన్నప్పుడు ఏ పని అయినా నెరవేరుతుంది. అలాగే కోరిక కూడా నెరవేరుతుందంట.