త్వరలో ధనవంతులు కాబోతున్నారు.. ఈ కలలు వస్తే కోటీశ్వరులే!

Updated on: May 16, 2026 | 7:19 PM

జ్యోతిష్య శాస్త్రంలో స్వప్న శాస్త్రానికి ప్రత్యేక ప్రాముఖ్యత ఉంటుంది. ప్రతి ఒక్కరూ కలలు కంటారు. ఇక కొంత మందికి మంచి స్వప్నాలు, శుభ ఫలితాలను ఇచ్చేవి వస్తే, మరికొంత మందికి మాత్రం అశుభ ఫలితాలను ఇచ్చే కలలు వస్తుంటాయి. అయితే స్వప్నశాస్త్రం ప్రకారం ఎలాంటి కలలు వస్తే, కోటీశ్వరులు అవుతారు, ధనవంతులు అవ్వాలి అంటే ఎలాంటి కలలు రావాలో ఇప్పుడు చూసేద్దాం.

1 / 5
స్వప్న శాస్త్రం ప్రకారం కలలు అనేవి భవిష్యత్తులో జరగబోయే సంఘటనల గురించి తెలియజేస్తుంటాయి. ఇక కొన్ని మన మనసులో ఉన్న బాధ, సంతోషం అన్నీ కూడా కలల రూపంలో కనిపిస్తాయి. ఇక కొందరికి పూర్వీకులు కలలో కనిపించి, సూచనలు కూడా ఇస్తుంటారు. ఇంకొంత మందికి దేవతామూర్తులు కనిపిస్తారు. అయితే లక్ష్మీదేవి అనుగ్రహం కలిగింది, త్వరలో మీరు కోటీశ్వరులు అవుతారు అనే ముందు కొన్ని సంకేతాలు కనిపించడం లేదా కొన్ని రకాల కలలు రావడం జరుగుతుందంట, అవి ఏవి అంటే?

2 / 5
స్వప్న శాస్త్రం ప్రకారం ఎవరికి అయితే కలలో తెల్ల ఏనుగు లేదా తెల్ల పాము కనిపిస్తుందో వారికి అదృష్టం పట్టబోతుంది అన్నట్లే అంటున్నారు పండితులు. కలలో తెల్ల ఏనుగు లేదా తెల్ల పాము కనిపించడం లక్ష్మీదేవి రాకను, సంపద పెరుగుదలను సూచిస్తుందంట. ఎవరికి అయితే ఇలాంటి కలలు వస్తాయో, వారు త్వరలోనే కోటీశ్వరులు అవ్వడం లేదా సమాజంలో మంచి పేరు ప్రఖ్యాతులు సంపాదించడం జరుగుతుందంట.

3 / 5
అలాగే ఎవరికి అయితే నిద్రలో ఎత్తైన పర్వతం లేదా పొడవాటి చెట్టు కనిపిస్తుందో, వారి జీవితం కొత్త మలుపు తిరగబోతుందని అర్థం. ఇది మీ జీవితంలో ఆర్థిక స్థిరత్వానికి, వృత్తి, వ్యాపారాల్లో పెరుగుదలను సూచిస్తుంది. ఇలాంటి కలలు చాల శుభప్రదం అని చెబుతున్నారు జ్యోతిష్య శాస్త్ర నిపుణులు. నీటితో నిండిన కుండను చూడటం కూడా ఆర్థికపరమైన ప్రయోజనాలను తీసుకొస్తుంది.

4 / 5
ధాన్యం రాశులు కలలో కనిపించడం కూడా చాలా మంచిదంట. ఇది లక్ష్మీదేవి రాకను సూచిస్తుందని చెబుతున్నారు స్వప్న శాస్త్ర నిపుణులు. ఎవరి కలలో అయితే ధాన్యం, పచ్చి గడ్డితో నిండిన పొలాన్ని చూస్తారో వారు జీవితంలో గొప్ప స్థాయికి ఎదగడ లేదా, ఇంటిలో ఆనందం, శ్రేయస్సు నెలకొనడం జరుగుతుందంట. ఇలాంటి కలలు చాలా శుభప్రదమైనవి.

5 / 5
అలాగే నిద్రపోతున్న సమయంలో కలలో దేవతలు లేదా దేవాలయాలు కలలో కనిపించడం కూడా శుభ సంకేతం. ఇది మీ జీవితంలో సంతోషం రాబోతుంది అనేదానికి అర్థం. ముఖ్యంగా కలలో శివుడిని లేదా లక్ష్మీదేవిని చూడటం చాలా మంచిదంట. ఇది అప్పుల బాధలు తొలిగిపోతాయని అర్థం. ఆర్థిక ఇబ్బందులు తొలగిపోయి, ఆదాయం పెరుగుతుందని ఈ కల సూచిస్తుందంట. నోట్: పై సమాచారం కేవలం ,ఇంటర్నెట్ పండితుల ఆధారంగా ఇవ్వడం జరిగింది. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదని పాఠకులు గమనించాలి.

Follow Us