
దీపావళి సమయంలో అనేక గ్రహాలు సంచారం చేయనున్నాయి. అంతే కాకుండా ఈ సమయంలో లక్ష్మీదేవి కొన్ని ప్రత్యేక రాశులపై తన అనుగ్రహం చూపనుంది. దీని వలన వారికి ఆర్థికంగా , ఆరోగ్యపరంగా ఇలా అన్ని విధాలుగా ప్రయోజనాలు చేకూర్చనుంది. అయితే ఈ దీపావళి పండుగ ఏ రాశుల వారికి లాభాలు తీసుకొస్తుందో ఇప్పుడు చూసేద్దాం.

వృషభ రాశి : వృషభ రాశి వారికి ఈ దీపావళి తర్వాత అదృష్ట తలుపులు తెరుచుకుంటాయి. వీరికి లక్ష్మీదేవి అనుగ్రహంతో ఆర్థిక ఇబ్బందులన్నీ తొలగిపోతాయి. వ్యాపారంలో భారీ లాభాలు, ఉద్యోగంలో జీతం పెరుగుదల ఉంటుంది. కొత్త ఇల్లు, వాహనం కొనే యోగం ఉంది. వీరికి లక్ష్మీదేవి అనుగ్రహం వలన సంపదకు లోటు ఉండదు. అనుకున్న కోరికలను నెరవేర్చుకుంటారు.

తుల రాశి : తుల రాశి వారికి ఈ దీపావళి ఓ వరం కానుంది. అన్ని విధాలుగా వీరికి కలిసి వస్తుంది. ఆదాయం కూడా డబుల్ అవుతుంది. పెండింగ్ లో ఉన్న డబ్బు మొత్తం చేతికి వస్తుంది. షేర్ మార్కెట్, పెట్టుబడుల్లో ఊహించని లాభాలు వస్తాయి. కుటుంబంలో సంతోషం, దాంపత్య జీవితంలో ప్రేమ పెరుగుతుంది. బంగారం కొనుగోలు చేసే అవకాశం ఉంది. వీరికి ఇది అద్భుతమైన సమయంగా చెప్పవచ్చును.

మీన రాశి : మీన రాశి వారిపై ఈసారి దీపావళి లక్ష్మి కటాక్షం పుష్కలంగా ఉంటుంది. విదేశీ ఉద్యోగ అవకాశాలు, ప్రమోషన్లు వస్తాయి. ఆరోగ్యం మెరుగుపడి మానసిక ప్రశాంతత లభిస్తుంది. పాత అప్పులన్నీ తీరిపోయి చేతిలో డబ్బు నిలుస్తుంది. ఆదాయం కూడా విపరీతంగా పెరుగుతుంది. ఊహించని విధంగా ఈ రాశి వారు వ్యాపారంలో లాభాలను పొందుతారు.

మేష రాశి : మేష రాశి వారికి ఈ పండుగ సమయంలో సంపద వర్షం కురవనుంది. వ్యాపార విస్తరణకు ఇదే సరైన సమయం. పోటీ పరీక్షల్లో విజయం, కోర్టు కేసుల్లో అనుకూల తీర్పు వస్తుంది. మీ పేరు, ప్రతిష్టలు సమాజంలో పెరుగుతాయి. ఆదాయం పెరుగుతుంది. రియలెస్టేట్ రంగంలో ఉన్నవారికి ఇది చాలా అద్బుతమైన సమయంగా చెప్పాలి.