
జూలై నెలలో శుక్ర గ్రహం, బుధ గ్రహం, సూర్యుడు, శని గ్రహాలు తమ దిశను మార్చుకుంటున్నాయి. దీని వలన నాలుగు రాశుల వారికి జూలై వరకు తిరుగులేని రాజయోగం పట్టనుంది. కాగా, ఇంతకీ ఆ రాశులు ఏవో ఇప్పుడు తెలుసుకుందాం.

వృషభ రాశి : వృషభ రాశి వారికి నాలుగు గ్రహాల కలయిక వలన అద్భుతమైన ప్రయోజనాలు కలుగుతాయి. అంతే కాకుండా వీరికి ఈ నెల మొత్తం చాలా అద్భుతంగా ఉంటుంది. కొత్త ఇల్లు లేదా భూమి కొనుగోలు చేసే ఛాన్స్ ఉంది. అన్నివిధాలుగా కలిసి వస్తుంది. ఆదాయం డబుల్ అవుతుంది.

మిథున రాశి : మిథున రాశి వారికి ఇది చాలా బెస్ట్ సమయం. వీరు తమ పనులను సకాలంలో పూర్తి చేసుకుంటారు. అంతే కాకుండా ఏ పని చేసినా అందులో విజయం సాధిస్తారు. విలాసవంతమైన జీవితాన్ని గడుపుతారు. ఉద్యోగులకు ప్రమోషన్ లభించే ఛాన్స్ ఉంది.

సింహ రాశి : సింహ రాశి వారికి ఇది చాలా అనుకూలమైన సమయం. ప్రేమలో ఉన్న వారు పెద్దలను ఒప్పించి, వివాహం చేసుకునే ఛాన్స్ ఉంది. కుటుంబ సభ్యులతో చాలా ఆనందంగా గడుపుతారు. జీవితంలో ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవడానికి ఇది మంచి సమయం.

తుల రాశి : జూలై మంత్ తుల రాశి వారికి చాలా అద్భుతంగా ఉంటుంది. సమయానుగుణంగా పనులను పూర్తి చేసుకుంటారు. ఆదాయం రెట్టింపు అవుతుంది. ఎవరు అయితే చాలా రోజుల నుంచి తమ పనులను వాయిదా వేసుకుంటూ వస్తున్నారో వారికి ఇది చాలా మంచి సమయం. డబ్బు పరంగా, ఆరోగ్య పరంగా అన్నివిధాలుగా కలిసి వస్తుంది