Chanakya Niti: తల్లిదండ్రులు పిల్లల ముందు పొరపాటున కూడా ఈ పనులు చేయవద్దంటున్న చాణక్య..

|

Nov 01, 2022 | 1:43 PM

ఆచార్య చాణక్యుడు నీతి శాస్త్రంలో పిల్లలు, పెద్దలు, మనుషుల మధ్య ఉండాల్సిన రిలేషన్ షిప్, మంచి చెడులను మనిషి ప్రవర్తన తీరుని పాలన ఇలా అనేక రకాల వియాలను ప్రస్తావించారు. పిల్లల ముందు తల్లిదండ్రులు పొరపాటున కూడా కొన్ని పనులు చేయకూడదని తెలిపారు.

1 / 5
ఆచార్య చాణక్యుడు నీతి శాస్త్రంలో మనిషి జీవితానికి సంబంధించిన అనేక విషయాలను ప్రస్తావించాడు. ఆచార్య చాణక్య ప్రకారం, పిల్లల ముందు కుటుంబ సభ్యులు మాట్లాడేటప్పుడు జాగ్రత్త వహించాలి. పిల్లల ముందు పొరపాటున కూడా కొన్ని పనులను చేయవద్దని ఆచార్య సూచించారు. ఆ పనులు ఏంటో తెలుసుకుందాం.

2 / 5
ఆచార్య చాణక్యుడు.. నీతి శాస్త్రంలో దాదాపు ప్రతి రంగానికి సంబంధించిన విషయాలను ప్రస్తావించాడు. ఈ విషయాలను అనుసరించడం ద్వారా ప్రతీ వ్యక్తి తన జీవితాన్ని ఉన్నతంగా మార్చుకోవచ్చు. అందుకే చాలామంది జీవితంలో తప్పటడుగులు వేయకుండా ఉండేందుకు.. ఉన్నత స్థానంలో ఎదిగేందుకు చాణుక్యుడు నీతిశాస్త్రంలో బోధించిన విషయాలను అనుసరిస్తుంటారు.

3 / 5
వాదించుకోవడం - ఆచార్య చాణక్యుడు ప్రకారం, తల్లిదండ్రులు పిల్లల ముందు ఒకరినొకరు కించపరుచుకుంటూ మాట్లాడకూడదు. గొడవలు పడకూడదు.  ఒకరికొకరు ఎప్పుడూ గౌరవం ఇచ్చి పుచ్చుకుంటూ ఉండాలి. పిల్లల దృష్టిలో తల్లిదండ్రుల మీద గౌరవం పెరుగుతుంది. 

4 / 5
లోటుపాట్లను ఎత్తిచూపుకోవద్దు - ఆచార్య చాణక్యుడు ప్రకారం, తల్లిదండ్రులు ఎప్పుడూ పిల్లల ముందు ఒకరి లోపాలను ఒకరు ఎత్తి చూపించుకోకూడదు. ఇలా చేస్తే పిల్లల దృష్టిలో తల్లిదండ్రులపై గౌరవం తగ్గిపోతుంది.

5 / 5
భాష విషయాల్లో అదుపు- ఆచార్య చాణక్యుడు ప్రకారం, పిల్లల ముందు ఎప్పుడూ ఒకరినొకరు దూషించుకుంటూ మాటలు మాట్లాడకూడదు. భాష విషయంలో పిల్లల ముందు ఎప్పుడూ జాగ్రత్తగా ఉండండి. పిల్లల ముందు మంచి భాషను ఉపయోగించండి. ఎందుకంటే పిల్లలకు తల్లిదండ్రులే మొదటి గురువు. పిల్లలు భాషను మొదట తల్లిదండ్రుల నుంచే నేర్చుకుంటారు.