
జ్యోతిష్య శాస్త్రంలో సంఖ్యాశాస్త్రం ప్రాముఖ్యత గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. పుట్టిన తేదీ, నెల, సంవత్సరం, లక్కీ నెంబర్‌ను బట్టి, కెరీర్ గురించి తెలుసుకోవచ్చు. ముఖ్యంగా పుట్టిన నెల ఒక వ్యక్తి భవిష్యత్తుపై ప్రత్యేక ప్రభావం చూపుతుందంట. అయితే ఇప్పుడు మనం అసలు మార్చి నెలలో జన్మించిన, అమ్మాయిలు , అబ్బాయిల వ్యక్తిత్వం ఎలా ఉంటుంది. వీరు గురించి సంఖ్యాశాస్త్రం ఏం చెబుతుందో చూద్దాం.

సంఖ్యాశాస్త్రం ప్రకారం మార్చి నెలలో జన్మించిన వారు చాలా అదృష్టవంతులు. ముఖ్యంగా వీరు కష్టపడి పని చేసే తత్వం కలవారు. అంతే కాకుండా వీరు ఏదైనా చేయాలని నిర్ణయించుకుంటే ఆ పని పూర్తి అయ్యే వరకు పట్టు విడవకుండా శ్రమిస్తారంట. తమ లక్ష్యాలను చాలా సులభంగా సాధిస్తారని చెబుతున్నారు సంఖ్యా శాస్త్ర నిపుణులు.

ముఖ్యంగా మార్చి అంటే 3వ నెల. అయితే ఈ నెలలో జన్మించిన వారు చాలా స్వచ్ఛమైన మనసు కలవారు. దానధర్మాలు చేయడంలో ముందుంటారు. స్నేహ స్వభావ ఉంటుంది. ముఖ్యంగా వీరితో ఉండటానికి చాలా మంది ఇష్టపడతారు. ఎందుకంటే, వీరు స్వభావం అంత తియ్యగా ఉంటుంది. అంతే కాకుండా తెలివితేటల పరంగా కూడా చాలా ఉన్నతంగా ఉంటారు.

మార్చిలో జన్మించిన వారికి మంచి నైపుణ్యం ఉంటుంది. వీరు తమ తెలివితేటలతో ఉన్నత స్థానంలో ఉంటారు. ముఖ్యంగా ఏదైనా సరే చాలా త్వరగా కనిపెట్టే స్వభావం వీరిలో ఉంటుంది. అంతే కాకుండా వీరు అంత త్వరగా మోసపోరు. ఏ పని చేసినా తెలివితో చేస్తారు. ఏ విషయంలోనైనా వీరిదే పై చేయి అవుతుంది.

మార్చి నెలలో జన్మించిన వారికి నాయకత్వ లక్షణాలు చాలా ఎక్కువగా ఉంటాయి. సామాజిక కార్యక్రమాల్లో కూడా చాలా ఇష్టంగా పాల్గొంటారు. తమపై తమకు ఉండే నమ్మకమే వీరిని పై స్థాయిలో నిలబెడుతుంది. కెరీర్ ప్రారంభంలో కష్టాలు ఉన్నప్పటికీ, వీరికి 30 సంవత్సరాల వయసు వచ్చిన తర్వాత అదృష్టం తలుపు తడుతుంది. అన్నింట్లో విజయం చేకూరుతుంది.