పొరపాటున నాగు పామును చంపారా? ఇది పాపమేనా?

Updated on: May 21, 2026 | 8:21 AM

పాములు ఇంటిలోకి రావడం సహజం. ముఖ్యంగా నాగుపాము ఎక్కువగా జనావాసాల్లోకి వస్తుంది. అయితే కొన్ని సార్లు దాని నుంచి రక్షణ పొందడానికి చాలా మంది పామును చంపుతుంటారు. అయితే ఇలా పామును చంపడం పాపమా? అనుకోకుండా చంపితే ఎలాంటి పనులు చేయాలో ఇప్పుడు మనం చూసేద్దాం.

1 / 5
వేసవిలో, వర్షాకాలం ప్రారంభంలో పాములు ఎక్కువగా ఇళ్లలోకి వస్తుంటాయి. ముఖ్యంగా సమ్మర్‌లో ఎండవేడిమి , ఉక్కపోతతో, ఇళ్లలోకి, షూస్, బైక్ ఇలా చాలా చోట్ల దాక్కుంటాయి. కొన్ని సార్లు వీటి వలన ప్రజలకు ప్రమాదం కూడా ఏర్పడని సందర్భాలు ఉన్నాయి. ముఖ్యంగా నాగుపాము వేసవిలో చాలా కోపంగా, బుసలు కొడుతూ ఉంటుంది. కాటు వేయడానికి ఆలోచించదు.

2 / 5
అందుకే చాలా మంది ఇంటికి నాగు పాము వస్తే చాలు దానిని చంపేస్తుంటారు. అంతే కాకుండా కొందరు ఇంటిలోకి పాము రావడం వలన అనుకోకుండా చంపడం లేదా ఏదైనా బండి మీద వెళ్లినప్పుడు అడ్డుగా వచ్చి అది చనిపోవడం ఇలా అనేక సంఘటనలు జరుగుతుంటాయి. అయితే పామును చంపడంపై అసలు జ్యోతిష్య శాస్త్ర నిపుణులు ఏమంటున్నారు? అనేది మనం తెలుసుకుందాం.

3 / 5
జ్యోతిష్యశాస్త్ర నిపుణుల ప్రకారం పాములను చంపడం పాపంతో సమానం అంటున్నారు. దీని వలన కాల సర్ప దోషం చుట్టుకుంటుందంట. అందుకే వీలైనంత వరకు మీ ఇంటి దగ్గర పాము కనిపిస్తే, స్నేక్ సోసైటీకీ సమాచారం ఇవ్వాలి తప్ప వాటిని మీరు మీ చేతితో చంపకూడదు అని హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా నాగు పాము విషయంలో తగు జాగ్రత్తలు తీసుకోవాలంట.

4 / 5
ఒక వేళ మీరు అనుకోకుండా నాగు పామును చంపితే తప్పకుండా దానికి కొన్ని నియమాలు పాటించాలని వారు హెచ్చరిస్తున్నారు. నాగు పామును గనుక చంపినట్లు అయితే, దానికి పాలు పోసి, రూపాయి నాణెం సమర్పించి, పాతి పెట్టడం లేదా కాల్చి వేయడం చేయాలి. అంటే దానికి దహన సంస్కారాలు చేయాలంట.

5 / 5
ఎందుకంటే చాలా వరకు నాగు పామును హిందూ సంప్రదాయంలో దైవ స్వరూపంగా భావిస్తారు. అయితే మీరు అనుకోకుండా నాగుపామును చంపినప్పుడు, మీ జీవితంలో ఎలాంటి సమస్యలు ఎదురు కాకుండా, జీవితం ఆనందంగా సాగిపోవాలి అంటే, మనిషి చనిపోతే ఏ విధంగా కార్యక్రమాలు చేస్తారో, పాము చనిపోతే కూడా అలా చేయాలి అని చెబుతున్నారు పండితులు. నోట్ : ఈ వార్తలలో ఇవ్వబడిన సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. పాఠకుల ఆసక్తి మేరకు.. పలువురు పండితుల సూచనలు, వారి తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు.

Follow Us