
తుల రాశి : తుల రాశి వారికి అన్నివిధాలుగా కలిసి వస్తుంది. అంతే కాకుండా వీరికి కుటుంబం నుంచి మంచి సహాయ సహాకారాలు అందుతాయి. ఆర్థికంగా, ఆరోగ్య పరంగా అన్ని విధాలుగా వీరికి చాలా అద్భుతమైన ప్రయోజనాలు చేకూరుతాయి. ఆఫీసులో పనులు సజావుగా సాగుతాయి. చాలా రోజుల నుంచి ప్రమోషన్ కోసం ఎవరు అయితే ఎదురు చూస్తున్నారో, వారికి ఇది చాలా మంచి సమయంగా చెప్పవచ్చు.

కన్యా రాశి : బాబా వంగా జోస్యం ప్రకారం కన్యా రాశి వారు ఈ సంవత్సరం ముగిసేలోపు ఆర్థిక సమస్యల నుంచి బయటపడటమే కాకుండా, వీరికి అన్ని విధాలుగా కలిసి వస్తుందంట. చాలా రోజుల నుంచి విదేశాలకు వెళ్లాలి అనుకునే వారు అక్కడికి వెళ్లి స్థిరపడతారు. కోర్టు సంబంధిత వ్యవహారాలు కూడా వీరికి చాలా అనుకూలంగా వస్తాయంట. అంతే కాకుండా రాశి వారు 2026లో ఎక్కువ లాభాలను పొందుతారంట.

ధనస్సు రాశి : ధనస్సు రాశి వారికి ఆదాయం పెరుగుతుంది. అంతే కాండా ఈ సంవత్సరం చివరి లోపు వీరు ఏదైనా గొప్ప కార్యం చేస్తారు. అంతేకాకుండా ఇంటి నిర్మాణం చేపట్టే ఛాన్స్ ఉంది. అన్ని విధాలుగా వీరికి చాలా లాభదాయకంగా ఉంటుంది. అద్భుతంగా కలిసి వస్తుంది.

కుంభ రాశి : కుంభ రాశి వారికి పనులు సమయానుగుణంగా పూర్తి చేసుకుంటారు. ఈ సంవత్సరం చివరి వరకు నూతన వాహనం కొనుగోలు చేసే ఛాన్స్ ఉంది. అంతే కాకుండా ఉద్యోగం కూడా మీకు భారంగా అనిపించదు. ఎక్కువ మొత్తంలో డబ్బును పొదుపు చేస్తారు. జీతాలు కూడా పెరిగే ఛాన్స్ ఉంది. డబ్బు పొదుపు చేయడంతో మీరు చాలా ఆనందంగా గడుపుతారు.

నోట్ : ఈ వార్తలలో ఇవ్వబడిన సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. పాఠకుల ఆసక్తి మేరకు.. పలువురు పండితుల సూచనలు, వారి తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు