Soaked Dates: బ్రెయిన్‌ పాదరసంలా పనిచేయాలా? అయితే నానబెట్టిన ఖర్జూరాలు తినేయండి

|

Jul 29, 2024 | 9:15 PM

డెజర్ట్‌లలో పంచదార కలపడం కంటే, చాలా మంది ఖర్జూరాలను కలిపి తీసుకుంటూ ఉంటారు. దీనిలోని తీపి రుచి కారణంగా చక్కెరకు ప్రత్నామ్నాయంగా వినియోగించుకోవచ్చు. ఖర్జూరాన్ని క్రమం తప్పకుండా తినడం వల్ల అనేక వ్యాధులకు దూరంగా ఉండవచ్చంటున్నారు ఆరోగ్య నిపుణులు..

1 / 5
డెజర్ట్‌లలో పంచదార కలపడం కంటే, చాలా మంది ఖర్జూరాలను కలిపి తీసుకుంటూ ఉంటారు. దీనిలోని తీపి రుచి కారణంగా చక్కెరకు ప్రత్నామ్నాయంగా వినియోగించుకోవచ్చు. ఖర్జూరాన్ని క్రమం తప్పకుండా తినడం వల్ల అనేక వ్యాధులకు దూరంగా ఉండవచ్చంటున్నారు ఆరోగ్య నిపుణులు.

2 / 5
ఖర్జూరాన్ని ఉదయాన్నే తింటే ఎన్నో ప్రయోజనాలు పొందవచ్చు. అయితే వీటిని నీటిలో నానబెట్టి తీసుకోవడం వల్ల ఆరోగ్యంతోపాటు ఫిట్‌గా ఉండవచ్చు. ఖర్జూరంలో ఫైబర్, విటమిన్లు, పొటాషియం, మెగ్నీషియం వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి శారీరక అలసటను తొలగిస్తుంది. అవసరమైన శక్తిని అందిస్తుంది. నానబెట్టిన ఖర్జూరం తినడం వల్ల ఈ ప్రయోజనాలు రెట్టింపు అవుతాయి.

3 / 5
నానబెట్టిన ఖర్జూరం తేలికగా జీర్ణమవుతుంది. అలాగే ఖర్జూరంలోని విటమిన్లు, మినరల్స్ మరింత చురుగ్గా మారతాయి. శరీరానికి ఇన్ఫ్లమేటరీ ప్రయోజనాలను అందిస్తుంది. ఖర్జూరంలో కాల్షియం, మాంగనీస్, ఫాస్పరస్ వంటి ఖనిజాలు కూడా ఉంటాయి. ఇవి ఎముకల దృఢత్వానికి తోడ్పడతాయి. కీళ్ల నొప్పులు, కీళ్ల వాపులను నివారించడానికి ప్రతిరోజూ ఉదయం నానబెట్టిన ఖర్జూరం తినడం అలవాటు చేసుకోవాలి.

4 / 5
బ్రెయిన్ ఆరోగ్యంగా ఉండాలంటే నానబెట్టిన ఖర్జూరాలు తినాలని నిపుణులు సిఫార్సు చేస్తున్నారు. మెదడు పనితీరును మెరుగుపరచడానికి ఖర్జూరాలు ఉపయోగపడతాయి. ఖర్జూరాలలో విటమిన్ బి6, మాంగనీస్ ఉంటాయి. ఇవి మెదడు ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి.

5 / 5
నానబెట్టిన ఖర్జూరాలు గుండె ఆరోగ్యాన్ని కాపాడుతాయి. వీటిల్లోని పొటాషియం రక్తపోటును అదుపులో ఉంచుతుంది. రక్త నాళాల పనితీరును మెరుగుపరుస్తుంది. నానబెట్టిన ఖర్జూరాలను క్రమం తప్పకుండా తినడం ద్వారా గుండె జబ్బుల ప్రమాదాన్ని నివారించవచ్చు. ఖర్జూరాలు శరీరంలో రోగనిరోధక శక్తిని పెంపొందించడానికి సహాయపడతాయి. నానబెట్టిన ఖర్జూరం తినడం వల్ల శరీరంలో రోగనిరోధక శక్తి పెరిగి వర్షాకాలంలో వ్యాధుల నుంచి కాపాడుతుంది.