
అలాంటి వారికి ఒక అద్భుతమైన, సమర్థవంతమైన గృహ చిట్కా . మీ ఇంట్లోనే సులభంగా తయారు చేసుకోగల ఈ ప్రత్యేక నూనెను ఒక్కసారి వాడితే చాలు, మీ నొప్పులన్నీ మాయమై వృద్ధాప్యంలో కూడా మీరు గుర్రంలా చురుకుగా మారతారని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. నూనె తయారీకి అవసరమైన పదార్థాలు: నువ్వుల నూనె: ఒక కప్పు, వాము: ఒక స్పూన్, లవంగాలు: ఐదు, దాల్చినచెక్క: ఒక ఇంచు , వెల్లుల్లిపాయలు: రెండు రెబ్బలు, కర్పూరం బిళ్ళలు: రెండు తీసుకోవాలి.

ముందుగా, ఒక స్టవ్ మీద ఒక గిన్నెను పెట్టుకొని, అందులోకి ఒక కప్పు నువ్వుల నూనెను వేయాలి. నువ్వుల నూనె కీళ్ల నొప్పులకు, కండరాల నొప్పులకు చాలా బాగా పనిచేస్తుంది. ఇది శరీరంలోకి లోతుగా చొచ్చుకుపోయి నొప్పులను తగ్గిస్తుంది. నూనె కొద్దిగా వేడెక్కిన తర్వాత, అందులోకి ఒక స్పూన్ వామును వేసుకోవాలి. వాము యాంటీ ఇన్‌ఫ్లమేటరీ లక్షణాలను కలిగి ఉంటుంది, ఇది నొప్పి, వాపును తగ్గించడంలో సహాయపడుతుంది.

వాము వేసుకున్న తర్వాత, ఐదు లవంగాలను, ఒక ఇంచు దాల్చినచెక్కను కూడా వేయాలి. లవంగాలు, దాల్చినచెక్క రెండూ శక్తివంతమైన అనాల్జెసిక్ (నొప్పి నివారిణి) లక్షణాలను కలిగి ఉంటాయి, ఇవి రక్త ప్రసరణను మెరుగుపరుస్తాయి. కండరాల ఉద్రిక్తతను తగ్గిస్తాయి. ఈ పదార్థాలు కొద్దిగా వేగిన తర్వాత, ఇప్పుడు ఇందులోకి రెండు వెల్లుల్లిపాయల రెబ్బలను వలిచి వేసుకోవాలి. వెల్లుల్లి కూడా సహజసిద్ధమైన నొప్పి నివారిణిగా.. యాంటీ ఇన్‌ఫ్లమేటరీ ఏజెంట్‌గా పనిచేస్తుంది. వెల్లుల్లి రెబ్బలు ఎర్రగా అయ్యేంత వరకు వేయించుకోవాలి.

వెల్లుల్లి ఎర్రగా వేగిన తర్వాత, స్టవ్ ఆఫ్ చేసుకుని, ఈ నూనెను గోరువెచ్చగా అయ్యేంత వరకు పక్కన పెట్టుకోవాలి. నూనె కొద్దిగా చల్లారిన తర్వాత, ఇప్పుడు ఇందులోకి రెండు కర్పూరం బిళ్ళలను పొడిగా చేసుకుని వేసుకోవాలి. కర్పూరం నొప్పుల నుండి తక్షణ ఉపశమనం అందిస్తుంది. ఇది చల్లదనాన్ని అందించి నొప్పిని తగ్గిస్తుంది. కర్పూరం పొడిని వేసుకుని ఒకసారి బాగా కలుపుకోవాలి.

ఈ నూనెను ఒక గాజు సీసాలో వేసుకుని నిల్వ చేసుకోవచ్చు. ఇలా తయారు చేసుకున్న నూనె నెల రోజుల పాటు నిల్వ ఉంటుంది. ఈ నూనెను ఎలా వాడాలంటే, ప్రతిరోజూ రాత్రి పడుకునే ముందు ఎక్కడైతే నొప్పులు ఉన్నాయో (మోకాళ్ళు, కీళ్లు, నడుం, మెడ) అక్కడ ఈ నూనెను రాసుకుని ఐదు నిమిషాల పాటు సున్నితంగా మసాజ్ చేసుకోవాలి. ఇలా క్రమం తప్పకుండా చేయడం వల్ల నొప్పులు క్రమంగా తగ్గిపోతాయి. ఒకే రోజులో నొప్పుల నుండి తక్షణ ఉపశమనం కావాలంటే, ఈ నూనెను గోరువెచ్చగా చేసి, నొప్పులు ఉన్న దగ్గర రాసుకుని మసాజ్ చేసుకోవాలి. ఇది ఎంతటి మొండి నొప్పుల నుండి అయినా ఉపశమనం అందిస్తుంది.