
ప్రతి ఒక్కరి ఇంటి వద్ద ఉండే మొక్కల్లో మందారం మొక్క కూడా ఒకటి. ఇది చాలా త్వరగా పెరుగుతుంది. అంతే కాకుండా ఎక్కువ మొత్తంలో పూలను ఇస్తుంది. అందుకే చాలా మంది వీటిని తమ ఇంటిలో నాటుకుంటారు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాలలో ప్రతి ఒక్కరి ఇంటిలో ఈ మొక్క అనేది తప్పనిసరిగా ఉంటుంది. ఇక ఈ మందారం ఎరుపు, గులాబీ, పసుపు, ఇలా చాలా రంగుల్లో ఉంటాయి.

అయితే లక్ష్మీదేవికి మందారం పువ్వు చాలా ఇష్టం అంటారు. ఇక ఈ నవరాత్రుల సమయంలో మందారం పువ్వుతో అమ్మవారిని పూజించడం వలన అనుగ్రహం కలుగుతుందని చెబుతుంటారు. అంతేకాకుండా వాస్తు ప్రకారం ఈ మొక్క ఇంటిలో ఉండటం వలన కూడా అనేక ప్రయోజనాలు కలుగుతాయి. ఆయుర్వేద పరంగా కూడా దీనిని ఉపయోగించడం వలన బోలెడు లాభాలు ఉన్నాయి. మరి దీని వలన ఇన్ని ప్రయోజనాలు ఉన్న ఈ పువ్వులను పూజకు ఉపయోగించ వచ్చునా? అంటే?

చాలా మంది పూజకు సువాసన ఉన్న పువ్వులను ఉపయోగిస్తారు. ఎలాంటి సువాసన లేని మందారం ఉపయోగించవచ్చా అనే డౌట్ ఉంటుంది. అయితే మందారం పువ్వుకు స్మెల్ లేకపోయినప్పటికీ, దాని రంగు, ఆకర్షణ వలన ఇది చాలా దేవతలకు ప్రియమైన పువ్వుగా ఉంటుందంట.

ఎర్ర మందారం పువ్వు చాలా శక్తివంతమైనది. ముఖ్యంగా లక్ష్మీదేవికి ఇది చాలా ప్రియమైన పువ్వు. అందుకే చాలా పువ్వులను పూజల్లో మినహాయించినప్పటికీ మందారం పువ్వును మినహాయించలేదంట. ఎందుకంటే చాలా శక్తివంతమైన పవిత్రమైన పువ్వుల్లో ఇదొక్కటి. అందుకే ప్రతి పూజలో ఈ పువ్వును ఉపయోగిస్తుంటారు. మందార పువ్వులతో పూజ చేయడం వలన భగవంతుడి అనుగ్రహం కలుగుతుందంట.

ముఖ్యంగా ఎవరు అయితే ఎరుపు రంగు మందారం పువ్వులతో పూజ చేస్తారో వారిపై లక్ష్మీదేవి అనుగ్రహం ఉంటుంది. ఎందుకు అంటే దేవతలకు చాలా ప్రియమైన పువ్వులో ఇదే ముందు ఉంటుంది. అంతే కాకుండా గణేశుడికి కూడా ఎర్ర మందారం చాలా ఇష్టం. దీనిని సమర్పించి పూజ చేయడం వలన ఆటంకాలు తొలిగిపోయి లక్కు కలిసి వస్తుందని చెబుతుంటారు. అందువలన ఎర్ర మందారం , వేరే ఏ రంగు అయినా సరే మందారం పువ్వులు పూజకు ఉపయోగించ వచ్చునంట.