
మిథున రాశి : మిథున రాశి వారికి శని వక్రగతి ఎంతో శుభప్రదంగా మారనుంది. గత కొంతకాలంగా పడుతున్న ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయి. ఉద్యోగంలో ఎదురుచూస్తున్న ప్రమోషన్, జీతం పెంపు దక్కే అవకాశం ఉంది. వ్యాపారస్తులకు కొత్త ఒప్పందాలు కుదురుతాయి. కుటుంబంలో సంతోషకర వాతావరణం నెలకొంటుంది.

సింహ రాశి :సింహ రాశి వారికి ఈ శని వక్రగతి అదృష్టాన్ని తెచ్చిపెడుతుంది. చాలా కాలంగా ఎదుర్కొంటున్న కోర్టు కేసులు, వివాదాలు మీకు అనుకూలంగా మారతాయి. ఉద్యోగంలో పై అధికారుల నుంచి ప్రశంసలు అందుతాయి. కొత్త ఉద్యోగ అవకాశాలు వస్తాయి. ఆర్థికంగా బలపడతారు. పెట్టుబడుల విషయంలో లాభాలు వస్తాయి.

మేష రాశి : మేష రాశి వారికి శని వక్రగతి కారణంగా కెరీర్ లో పెద్ద మార్పు రాబోతుంది. ఇప్పటి వరకు ఆగిపోయిన పనులు వేగంగా పూర్తవుతాయి. విదేశాల్లో ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్న వారికి శుభవార్త అందుతుంది. వ్యాపారంలో భాగస్వాములతో ఉన్న విభేదాలు తొలగుతాయి. డబ్బు విషయంలో జాగ్రత్తగా ఉంటే మంచి లాభాలు వస్తాయి. కుటుంబ పెద్దల ఆరోగ్యం మెరుగుపడుతుంది.

కన్యా రాశి : కన్యా రాశి వారికి శని వక్రగతి అద్భుతమైన ఫలితాలను ఇవ్వనుంది. చాలా రోజులుగా వేధిస్తున్న అప్పుల బాధ తీరుతుంది. ఇంట్లో శుభకార్యాలు జరిగే అవకాశం ఉంది. విద్యార్థులకు చదువులో మంచి ర్యాంకులు వస్తాయి. పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న వారికి విజయం లభిస్తుంది. ఉద్యోగంలో బదిలీ కోరుకునే వారికి అనుకూలమైన చోటికి బదిలీ అవుతుంది. ఆరోగ్య సమస్యలు తగ్గి, మానసిక ప్రశాంతత లభిస్తుంది.

కుంభ రాశి :కుంభ రాశికి అధిపతి శనే కావడంతో ఈ వక్రగతి వీరికి విశేష ఫలితాలను ఇస్తుంది. ఏలినాటి శని ప్రభావం తగ్గి, జీవితంలో వెలుగు వస్తుంది. ఆదాయం పెరుగుతుంది. కొత్త ఆస్తులు కొనే యోగం ఉంది. ఉద్యోగంలో స్థిరత్వం వస్తుంది. వ్యాపారస్తులకు పెద్ద లాభాలు వస్తాయి. మిత్రుల సహాయంతో ఆగిపోయిన పనులు పూర్తవుతాయి.