
మీన రాశి : మీన రాశి వారికి ఆర్థిక సమస్యలే పెద్ద తలనొప్పిగా మారిపోతాయి. వీరు ఇచ్చిన డబ్బు తిరిగిరాదు, వీరు ఇతరులకు ఇవ్వా్ల్సింది ఇవ్వలేకపోతారు. ఇవి ప్రాణం మీదకు వస్తాయి. అందువలన చాలా జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా డబ్బు విషయంలో ఒకటికి రెండు సార్లు ఆలోచించాలి. ఇష్టదైవాన్ని ప్రార్థించడం చాలా మంచిది.

మేష రాశి : మేష రాశి వారికి ఏలినాటి శని ప్రభావం, శని గ్రహం చెడు దృష్టి వలన వీరు అనేక ఇబ్బందులు ఎదుర్కుంటారు. ముఖ్యంగా అప్పుల బాధలు ఎక్కువ అవుతాయి. ఆర్థిక సమస్యలు వేధిస్తాయి. అన్నివిధాలుగా వీరికి చాలా ఇబ్బందుల వస్తాయి. దీంతో మానసికంగా, శారీరకంగా చాలా కుంగిపోతారు.

వృశ్చిక రాశి : వృశ్చిక రాశి వారికి ఆరోగ్యం పూర్తిగా దెబ్బతింటుంది. అనుకోని అవమానాలు ఎదుర్కోవాల్సి వస్తుంది. నమ్మినవారే మోసం చేస్తారు. ఏ పని చేసినా కలిసి రాదు. ఇతరులచే మాటపట్టింపులు రావడం వలన బాధలో కూరుకపోతారు. అందువలన ఈ రాశి వారు చాలా జాగ్రత్తగా ఉండాలి.

కుంభ రాశి : ఆందోళన, టెన్షన్ వంటి సమస్యలు ఎక్కువ అవుతాయి. దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు వేధిస్తాయి. ప్రారంభించిన పని మధ్యలోనే ఆగిపోతుంది. లేదా పనికి ఆటంకాలు ఎక్కువ అవుతాయి. ఆర్థిక సమస్యలు కూడా ఎక్కువ అవుతాయి. సమాజంలో ఉన్న గుర్తింపు కూడా పోతుంది. దీని వలన ఈ రాశి వారు చాలా ఇబ్బందులు ఎదుర్కుంటారు.

నోట్ : ఈ వార్తలలో ఇవ్వబడిన సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. పాఠకుల ఆసక్తి మేరకు.. పలువురు పండితుల సూచనలు, వారి తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు