
శరీరంలో వేడి పెరిగిందనిపిస్తే, చాలామంది వెంటనే సబ్జా గింజలు నీళ్లలో నానబెట్టి త్రాగమని సలహా ఇస్తుంటారు. కొన్ని గంటల పాటు నానబెట్టిన సబ్జా గింజల నీటిని త్రాగితే వేడి తగ్గుతుందని ప్రజలు నమ్ముతారు. ఇది కేవలం నీరు త్రాగడం వల్ల కలిగే ప్రయోజనం తప్ప, సబ్జా గింజల వల్ల కాదని కొందరు అనుకుంటారు, మీరు ఒకటి, రెండు గ్లాసుల సబ్జా నీళ్లు త్రాగినప్పుడు, ఆ నీళ్లే శరీరానికి చల్లదనాన్ని అందిస్తాయి.

సబ్జా గింజలు వేయకుండా కేవలం ఒట్టి నీళ్లు త్రాగితే వేడి తగ్గదని అంటున్నారు. నిజంగా సబ్జా గింజలే వేడిని తగ్గించేవైతే, నీటిలో వేయకుండా ఒట్టిగా తిని తగ్గించుకోవాలని నిపుణులు అంటున్నారు. వేడిని తగ్గించే ఏకైక సహజమైన మార్గం నీళ్లు త్రాగడమేనని ఆయన తేల్చి చెప్పారు. రేడియేటర్లో నీళ్లు తగ్గితే ఇంజిన్ వేడెక్కుతుందని, నీళ్లు పోస్తేనే వేడి తగ్గుతుందని అంటున్నారు.

బరువు తగ్గాలనే కోరికతో చాలామంది అనేక చిట్కాలను పాటిస్తుంటారు. "సబ్జా గింజలు నీళ్లల్లో వేసుకొని తాగితే బరువేం తగ్గరండీ" అని అంటున్నారు. బరువు తగ్గాలంటే వ్యాయామం చేయాలి లేదా ఆహార నియమాలను పాటించాలి. ఆహారం తక్కువగా తీసుకున్నప్పుడు శరీరానికి కావాల్సిన శక్తి ఆహారం వలన అందక, అది నిల్వ ఉన్న కొవ్వును కరిగించడం ప్రారంభిస్తుంది. ఇది బరువు తగ్గడానికి దారితీస్తుంది.

ఉదయం టిఫిన్ తినకుండా, టీ, కాఫీ, పాలు త్రాగకుండా మధ్యాహ్నం 12 గంటల వరకు కేవలం నీళ్లు త్రాగుతూ ఉంటే, మీరు బరువు తగ్గుతారు. ఈ బరువు తగ్గడం నీళ్లు త్రాగడం వల్ల, ఆహారం తీసుకోకపోవడం వల్ల జరుగుతుంది తప్ప, అందులో సబ్జా గింజలు వేసినందువల్ల కాదు. సబ్జా గింజలు వేయకుండా ఒట్టి నీళ్లు త్రాగినా కూడా ఇదే ఫలితం ఉంటుందని అంటున్నారు. నీళ్లు త్రాగడం వల్ల శరీరానికి క్యాలరీలు అందవు, నిల్వ ఉన్న కొవ్వు కరిగి బరువు తగ్గుతారు.

కొవ్వు కరగాలంటే ఆహార నియమాలు, వ్యాయామం తప్పనిసరి అని చెప్పారు. మంచినీళ్లు త్రాగితే శరీర వేడి తగ్గుతుంది, సరైన ఆహార నియమాలతో బరువు తగ్గుతుంది. సబ్జా గింజలు సరదాగా త్రాగాలనుకుంటే త్రాగవచ్చు, కానీ వేడిని తగ్గిస్తాయని లేదా బరువును తగ్గిస్తాయని ఆశించి త్రాగవద్దని అని చెబుతున్నారు.