
నెలసరి సమస్యల నియంత్రణ: చాలా మంది మహిళలు క్రమరహిత నెలసరి (Irregular Periods) మరియు ఆ సమయంలో వచ్చే తీవ్రమైన కడుపునొప్పితో బాధపడుతుంటారు. పచ్చి బొప్పాయి శరీరంలో వేడిని పెంచి, ఈస్ట్రోజెన్ హార్మోన్ ఉత్పత్తిని ప్రేరేపిస్తుంది. దీనివల్ల గర్భాశయ కండరాలు సజావుగా కుంచించుకుపోయి, పీరియడ్స్ క్రమబద్ధంగా రావడానికి సహాయపడుతుంది. పీరియడ్స్ సమయంలో వచ్చే తిమ్మిరి, నొప్పిని తగ్గించడంలో కూడా ఇది అద్భుతంగా పనిచేస్తుంది.

బరువు తగ్గడానికి ఉత్తమం: పచ్చి బొప్పాయిలో క్యాలరీలు చాలా తక్కువగా, ఫైబర్ (పీచు పదార్థం) చాలా ఎక్కువగా ఉంటుంది. ఇది తిన్న తర్వాత కడుపు నిండిన అనుభూతిని కలిగిస్తుంది, తద్వారా అతిగా తినడాన్ని నివారిస్తుంది. ఇందులో ఉండే 'పపైన్' (Papain) అనే ఎంజైమ్ శరీరంలో పేరుకుపోయిన అనవసరమైన కొవ్వును వేగంగా కరిగించడానికి, జీవక్రియలను (Metabolism) వేగవంతం చేయడానికి సహాయపడుతుంది.

జీర్ణవ్యవస్థ మెరుగుపడుతుంది: మలబద్ధకం, గ్యాస్, ఎసిడిటీ వంటి సమస్యలతో బాధపడే మహిళలకు పచ్చి బొప్పాయి ఒక మంచి ఔషధం. ఇది తిన్న ఆహారాన్ని సులభంగా జీర్ణం చేయడమే కాకుండా, ప్రేగులను శుభ్రపరిచి జీర్ణవ్యవస్థ పనితీరును మెరుగుపరుస్తుంది. శరీరంలోని హానికరమైన టాక్సిన్స్ (వ్యర్థాలు) బయటకు పంపడంలో ఇది కీలక పాత్ర పోషిస్తుంది.

చర్మ సౌందర్యం, రోగనిరోధక శక్తి: పచ్చి బొప్పాయిలో విటమిన్-సి అధికంగా ఉండటం వల్ల ఇది శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచుతుంది. అలాగే ఇందులోని యాంటీఆక్సిడెంట్లు చర్మంపై ముడతలు, మచ్చలను తగ్గించి, ముఖానికి సహజమైన గ్లోను అందిస్తాయి.

ఎలా తీసుకోవాలి?: పచ్చి బొప్పాయిని చిన్న ముక్కలుగా కోసుకుని లైట్‌గా ఉడికించి సలాడ్ రూపంలో తీసుకోవచ్చు. లేదా మన సాంప్రదాయ పద్ధతిలో పచ్చి బొప్పాయి కూర (Curry), పచ్చడి లేదా సూప్ రూపంలో కూడా డైట్‌లో చేర్చుకోవచ్చు. ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే..పచ్చి బొప్పాయి మహిళల ఆరోగ్యానికి ఎంతో మేలు చేసినప్పటికీ, గర్భిణీ స్త్రీలు దీనిని అస్సలు తినకూడదు. ఇందులో ఉండే లాటెక్స్ (Latex) అనే పదార్థం గర్భస్రావానికి (Miscarriage) దారితీసే ప్రమాదం ఉంది. కాబట్టి గర్భధారణ సమయంలో దీనికి దూరంగా ఉండాలి.