Pulasa: పులస చేపల ధరలు భారీగా తగ్గాయి.. సామాన్యులకు అందుబాటులోకి

Updated on: Oct 19, 2026 | 3:19 PM

గోదావరిలో దొరికే పులస చేపల ధరలు తగ్గాయి.. సీజన్ ముగింపు వేళ సామాన్యులకు అందుబాటులోకి వచ్చాయి. ఏకంగా వేల రూపాయలు పలికిన చేప ఇప్పుడు అందుబాటు ధరల్లోకి వచ్చేసింది. ఇంతకీ మార్కెట్‌లో ఏం మారింది? కొనుగోలుదారులకు ఊరటనిస్తున్న తాజా పరిణామమేంటి ? ..

1 / 6
గోదావరి జిల్లాల్లో పులస చేపలంటే ఉండే క్రేజే వేరు. సీజన్‌లో ఈ చేపలకు ఎంత డిమాండ్ ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఒక్కో పులస రూ.20 వేల నుంచి రూ.30 వేల వరకు పలికిన సందర్భాలూ ఉన్నాయి. అయితే ఈ ఏడాది ఆశించిన స్థాయిలో పులసలు వలకు చిక్కకపోవడంతో ధరలు భారీగా పెరిగాయి. తాజాగా పరిస్థితి మారింది. యానాం మార్కెట్‌లో పులస చేపల ధరలు ఒక్కసారిగా తగ్గడంతో సామాన్యులు సైతం వీటిని కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు.

2 / 6
జూన్ నెల తర్వాత గోదావరికి వరద నీరు చేరే సమయంలో పులస చేపలు ఎదురీదుతూ నదిలోకి వస్తుంటాయి. ఈ చేపలకు ఉండే ప్రత్యేకమైన రుచి కారణంగా మార్కెట్‌లో ఎప్పుడూ మంచి గిరాకీ ఉంటుంది. గత వారం యానాంలో మత్స్యకారుల వలకు చిక్కిన ఓ పులస చేప ఏకంగా రూ.18 వేల ధర పలికింది. అయితే కొద్ది రోజులుగా చిన్న సైజు పులసలు ఎక్కువగా లభిస్తుండటంతో ధరలు తగ్గుముఖం పట్టాయి.

3 / 6
రెండు రోజుల క్రితం వేలంలో ఒక జత పులసలు రూ.800 ధర పలకగా.. ఆదివారం జరిగిన వేలంలో ఒక్కో చేప రూ.500 నుంచి రూ.1,200 వరకు విక్రయించారు. ప్రస్తుతం 200 గ్రాముల నుంచి 500 గ్రాముల బరువున్న పులసలు అందుబాటులోకి వస్తున్నాయి. చేప పరిమాణం, బరువును బట్టి ధర నిర్ణయిస్తున్నారు. దీంతో గతంలో వేల రూపాయలు వెచ్చించాల్సి వచ్చిన పులస చేపను ఇప్పుడు తక్కువ ధరకు కొనుగోలు చేసే అవకాశం లభిస్తోంది.

4 / 6
దసరా శరన్నవరాత్రుల నేపథ్యంలో మాంసాహార వినియోగం తగ్గడం కూడా ధరలపై ప్రభావం చూపి ఉండొచ్చనే చర్చ మార్కెట్‌లో సాగుతోంది. పండగ సమయంలో చాలామంది పూజలు, ఆచారాల కారణంగా మాంసాహారానికి దూరంగా ఉంటారు. మరోవైపు గోదావరిలో ఎర్రనీటి ప్రవాహం తగ్గుతున్న సమయంలో పులసలు లభిస్తుండటం కూడా ధరల మార్పునకు కారణంగా భావిస్తున్నారు.

5 / 6
పులస ధరలు తగ్గడంతో మరోవైపు చీరమేనుకు గిరాకీ పెరిగింది. ఆదివారం జరిగిన వేలంలో 10 లీటర్ల బక్కెట్ చీరమేను రూ.15 వేల నుంచి రూ.18 వేల వరకు ధర పలికింది. చీరమేను లభ్యత తగ్గితే పులస చేపలకు మళ్లీ డిమాండ్ పెరిగి ధరలు కూడా పైకి వెళ్లే అవకాశం ఉందని మత్స్యకారులు అంచనా వేస్తున్నారు.

6 / 6
మొత్తానికి ఈ ఏడాది పులసలు తక్కువగా లభించినప్పటికీ, తాజాగా ధరలు తగ్గడం చేపల ప్రియులకు ఊరటనిస్తోంది. గతంలో వేల రూపాయలు వెచ్చించి కొనాల్సిన పులసలు ఇప్పుడు అందుబాటు ధరల్లో లభిస్తుండటంతో సామాన్యులు సైతం ఈ అరుదైన చేప రుచిని ఆస్వాదిస్తున్నారు.

Loading...
Unable to load recommendations.
Follow Us