అన్నం, టిఫిన్లలోకి అద్దిరిపోయే ప్రొటీన్ రిచ్ పప్పుల పొడి.. ఆవకాయ కాంబినేషన్ అదిరిపోతుంది

Updated on: Sep 18, 2026 | 6:03 PM

తెలుగువారి ఇళ్లలో వేడివేడి అన్నం వడ్డించగానే మొదటగా గుర్తుకొచ్చేది కమ్మని పప్పుల పొడి మరియు నెయ్యి. చాలామంది కేవలం కందిపప్పుతో మాత్రమే కందిపొడి తయారుచేస్తుంటారు. అయితే అచ్చంగా కందిపప్పు మాత్రమే వాడకుండా, కందిపప్పుతో పాటు సమానంగా పెసరపప్పు, పుట్నాల పప్పు కలిపి చేస్తే పొడికి మరింత కమ్మదనం రావడమే కాకుండా శరీరానికి కావలసిన అధిక ప్రొటీన్లు లభిస్తాయి. 

1 / 5
కావలసిన పదార్థాలు: 200 గ్రాముల కప్పు కందిపప్పు, 200 గ్రాముల పెసరపప్పు, 100 గ్రాముల పుట్నాల పప్పు, 25 గ్రాముల ఎండుమిరపకాయల ముక్కలు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1 గుప్పెడు కరివేపాకు, 30 నుండి 40 - కచ్చాపచ్చాగా దంచిన వెల్లుల్లి రెబ్బలు, 2 స్పూన్ల నూనె, 1 టీస్పూన్ ఇంగువ, 2 టేబుల్ స్పూన్లు డ్రై మ్యాంగో పౌడర్ (ఐచ్ఛికం), రుచికి సరిపడా ఉప్పు

2 / 5
తయారీ విధానం: స్టవ్ వెలిగించి పాన్‌లో కందిపప్పును లో-మీడియం మంటపై ఎర్రగా, కమ్మటి సువాసన వచ్చేలా మాడకుండా వేయించి పక్కన ఉంచాలి. ఆ తర్వాత పెసరపప్పును కూడా దోరగా వేయించి తీసుకోవాలి. అనంతరం పుట్నాల పప్పును కేవలం 2 నిమిషాలు లైట్‌గా వేపి తీయాలి. అన్ని పప్పులను కలిపి కాకుండా విడివిడిగా వేయిస్తేనే సమంగా వేగుతాయి.

3 / 5
పాన్‌లో తుంచిన ఎండుమిర్చిని లో ఫ్లేమ్‌లో వేయించి తీయాలి. ఆపై జీలకర్రను మంచి వాసన వచ్చే వరకు వేపాలి. తర్వాత కరివేపాకును నూనె లేకుండా బాగా క్రిస్పీగా అయ్యేవరకు వేయించి వేరే గిన్నెలోకి తీసుకోవాలి. చివరగా పాన్‌లో రెండు స్పూన్ల నూనె వేసి, కచ్చాపచ్చాగా దంచిన వెల్లుల్లి రెబ్బలను ఎర్రగా వేయించి పక్కన పెట్టుకోవాలి.

4 / 5
పప్పులు, దినుసులు పూర్తిగా చల్లారిన తర్వాత.. మిక్సీ జార్‌లో ఎండుమిర్చి, జీలకర్ర, ఇంగువ, ఉప్పు వేసి ముందుగా గ్రైండ్ చేయాలి. ఆ తర్వాత వేయించిన పప్పులను ఒకేసారి కాకుండా కొద్దికొద్దిగా వేస్తూ బరకగా రుబ్బుకోవాలి. చివరగా వేయించిన వెల్లుల్లి రెబ్బలు కూడా వేసి మరోసారి పల్స్ చేయాలి.

5 / 5
గ్రైండ్ చేసిన పొడిని ప్లేట్‌లోకి తీసుకుని, వేయించి పెట్టుకున్న క్రిస్పీ కరివేపాకును చేత్తో నలిపి పొడిలో కలపాలి. ఇందులోనే 2 టేబుల్ స్పూన్ల ఆమ్‌చూర్ పౌడర్ వేసి సమంగా కలపాలి. పొడి వేడి పూర్తిగా తగ్గిన తర్వాత గాలి చొరబడని గాజు సీసాలో నిల్వ చేసుకుంటే ఎన్నో రోజుల పాటు తాజాగా ఉంటుంది. అన్నంలోకి, ఇడ్లీ, దోశల్లోకి అద్భుతమైన రుచినిచ్చే ఈ ప్రొటీన్ రిచ్ పప్పుల పొడిని తప్పకుండా ప్రయత్నించండి!

Loading...
Unable to load recommendations.
Follow Us