ఈ చిన్న ట్రిక్ తెలియక ఎన్ని డబ్బులు వేస్ట్ చేశామో.. వర్షాకాలంలో ఫోన్ తడిస్తే ఏం చేయాలంటే?

Updated on: Jul 21, 2026 | 1:29 PM

Monsoon gadget protection tips and tricks Telugu: వర్షాకాలంలో జనాలు ఎదుర్కొనే ప్రధాన సమస్య ఏదైనా ఉందంటే.. ఫోన్‌లు, ల్యాప్‌టాస్స్ వంటికి తడిపోవడం. ఎందుకంటే మనం బయటకు వెళ్లినప్పుడు సెడెన్‌ వర్షం కురిస్తే.. మన పాకెట్‌లో లేదా బ్యాగ్‌లో ఉండే ఫోన్, ల్యాప్‌టాప్‌ వాటర్‌ తడిచి పోతాయి. దీని వల్ల మన జేబుకు పెద్ద చిల్లే పడుతుంది. అయితే ఇవి తడవ కుండా రక్షించుకోవడానికి ఖరీదైన వాటర్‌ప్రూఫ్ గ్యాడ్జెట్లు కొనాల్సిన అవసరం లేదు. అందుబాటులో ఉండే యాక్సెసరీలతో పాటు కొన్ని చిన్న జాగ్రత్తలు తీసుకుంటే.. మీరు వేల రూపాయిల ఆదా చేసుకోవచ్చు. ఈ వర్షాకాలంలో ప్రతి ఒక్కరూ పాటించాల్సిన 5 ముఖ్యమైన గ్యాడ్జెట్ సేఫ్టీ టిప్స్ గురించి తెలుసుకుందాం.

1 / 5
వాటర్‌ప్రూఫ్ ఫోన్ పౌచ్, బ్యాగ్ కవర్: వర్షం పడినప్పుడు మన ఫోన్ లేదా బ్యాగ్ తడవకుండా ఉండేందుకు వాటికి వాటర్ ఫ్రూఫ్ పౌచ్‌లు దరించడం చాలా ముఖ్యం. ఇవి వర్షం నుంచి ఫోన్‌ను రక్షిస్తూనే, టచ్‌స్క్రీన్‌ను ఉపయోగించుకునేలా అవకాశాన్ని కల్పిస్తాయి. మీరు ల్యాప్‌టాప్ తీసుకెళ్తున్నట్లయితే వాటర్‌ప్రూఫ్ బ్యాక్‌ప్యాక్ కవర్ కొనండి. అలాగే మీ దగ్గర కీలకమైన డాక్యుమెంట్స్ ఏవైనా ఉంటే వాటిని సేఫ్‌గా ఉంచుకునేందుకు కోసం వాటర్‌ప్రూఫ్ డాక్యుమెంట్ పౌచ్ వాడండి. ఈ చిన్న జాగ్రత్తలు మీకు పెద్ద భారీన్ని తగ్గిస్తాయి.

2 / 5
చార్జింగ్ పోర్ట్ క్లీనింగ్: మనం బయటి నుంచి తడిచి వచ్చిన నప్పుడు నేరుగా ఫోన్‌ను ఛార్జింగ్ పెట్టకూడదు. తడిసిన పరికరాన్ని చార్జింగ్ పెట్టడం వల్ల అది త్వరగా పాడైపోతుంది. కాబట్టి ఛార్జింగ్ పెట్టే ముందు ఆ పోర్టులో వాటర్ ఏమైనా ఉన్నాయా? అనిచూడండి.. నీళ్లు ఉంటే మైక్రోఫైబర్ గుడ్డతో తడిని తుడవండి. నీరు మొత్తం పూర్తిగా ఆరిపోయాక ఛార్జింగ్ పెట్టండి. చార్జింగ్ పోర్ట్ తేమగా ఉన్నప్పుడు ఎట్టిపరిస్థితుల్లోనూ చార్జర్ కనెక్ట్ చేయవద్దు. అలాగే దాన్ని ఆరబెట్టేందుకు హెయిర్ డ్రైయర్ వంటివి ఉపయోగించవద్దు, ఎందుకంటే దాని నుంచి వచ్చే అధిక వేడి లోపలి పరికరాలను దెబ్బతీసే అవకాశం ఉంది.

3 / 5
బ్యాకప్ పవర్ బ్యాంక్: వర్షాకాలంలో విద్యుత్ సరఫరా నిలిచిపోవడం సాధారణం. ఇటువంటి సమయంలో పూర్తిగా చార్జ్ చేసిన పవర్ బ్యాంక్ ఎంతగానో ఉపయోగపడుతుంది. నైట్ టైంలో మీ ఇంట్లో కరెంటు పోయినా.. ఫోన్ బ్యాటరీ తక్కువగా ఉన్నా, గంటల తరబడి విద్యుత్ లేనప్పుడు, అత్యవసర కాంటాక్ట్‌లు, మ్యాప్స్ లేదా ఆన్‌లైన్ పేమెంట్స్ కోసం ఫోన్ వాడాల్సి వచ్చినప్పుడు ఇది మనకు ఎంతగానో ఉపయోగపడుతుంది. ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ చేసే పవర్ బ్యాంక్‌ను ఎంచుకుని, దాన్ని కూడా వాటర్‌ప్రూఫ్ పౌచ్‌లో భద్రపరచండి.

4 / 5
 సిలికా జెల్ ప్యాకెట్స్: షూ బాక్స్‌లు, ఎలక్ట్రానిక్ వస్తువుల ప్యాకింగ్‌లలో లభించే చిన్న సిలికా జెల్ ప్యాకెట్లు మీ గ్యాడ్జెట్లను తేమ నుండి రక్షిస్తాయి.వీటిని ల్యాప్‌టాప్ బ్యాగ్‌లు, కెమెరా బ్యాగ్‌లు, గ్యాడ్జెట్లు ఉంచే డ్రాయర్లలో వేసి ఉంచండి. ఇవి గాలిలోని తేమను పీల్చుకుని, తేమ వల్ల వస్తువులు పాడవకుండా చూస్తాయి.

5 / 5
ఫోన్ తడిస్తే ఏం చేయాలి: అయితే ఫోన్ తడిస్తే బియ్యంలో పెట్టాలని చాలా మంది చెబుతున్నారు. కానీ ఆపిల్ వంటి ప్రముఖ తయారీ సంస్థలు ఈ పద్దతి మంచిది కాదని చెబుతున్నాయి. ఇలా చేయడం వల్ల బియ్యంలోని దుమ్మ, దూళి, నూకలు చార్జింగ్ పోర్టులోకి , స్పీకర్లలోకి వెళ్లే ప్రమాదం ఉంది. కాబట్టి ఒక వేళ మీ ఫోన్ కనుక వర్షంలో తడిస్తే వెంటనే దాన్ని స్విచ్ ఆఫ్ చేయండి. కేస్, SIM ట్రేని బయటకు తీయండి. తర్వాత మెత్తటి గుడ్డతో బయటి తడిని తుడవండి. ఫోన్‌ను గాలి తగిలే, పొడి వాతావరణంలో 24 నుండి 48 గంటల పాటు ఆరనివ్వండి. పూర్తిగా ఆరిపోయిన తర్వాత మాత్రమే ఆన్ చేయండి. ఈ కొన్ని చిట్కాలతో వర్షాకాలంలో మన ఫోన్‌ను మనం సేఫ్‌గా ఉంచుకోవచ్చు,

Follow Us