
నవంబర్ నెలలో అనేక గ్రహాలు సంచారం చేయనున్నాయి. అంతే కాకుండా గ్రహాల కలయిక కూడా జరగనుంది. దీంతో 12 రాశులపై నవంబర్ నెల ప్రభావం చూపనుంది. ముఖ్యంగా, బుధుడు, గురు సంచారం, సూర్య సంచారం కూడా జరగనుంది. అనేక రాజయోగాలు ఏర్పడనున్నాయి. అయితే 12 రాశుల్లో నాలుగు రాశుల వారికి మాత్రం నవంబర్ 1 నుంచే లక్కు కలిసి రానుంది. ఇది వారికి అదృష్ట నెలగా కూడా మారనుంది. అందువలన ఏ రాశి వారికి ఇది శుభ ప్రదంగా ఉండనుందో ఇప్పుడు తెలుసుకుందాం.

కుంభ రాశి : కుంభ రాశి వారికి నవంబర్ ఒకటి నుంచి అదృష్టం కలిసి వస్తుంది. అనుకున్న పనులు అన్నీ కూడా సమయానికి పూర్తి చేసుకుంటారు. ఆకస్మిక ధనలాభం కలుగుతుంది. వృత్తి ఉద్యోగాల్లో కలిసి వస్తుంది. ఆదాయం పెరుగుతుంది. ఎవరు అయితే ఉద్యోగ బదిలీ కోరుకుటున్నారో వారికి కోరిక నెరవేరుతుంది. మంచి సంస్థలో జాయిన్ అయ్యే ఛాన్స్ ఎక్కువగా ఉంది.

మిథున రాశి : మిథున రాశి వారికి ఈ నెల మొదటి నుంచి బుధుడి బలం పెరగడంతో మాటే మంత్రం అవుతుంది. వ్యాపారం చేసే వారికి కొత్త క్లయింట్లు వస్తారు, ఒప్పందాలు సెటిల్ అవుతాయి. చాలా కాలంగా ఆగిపోయిన డబ్బు చేతికి అందుతుంది. విద్యార్థులకు పోటీ పరీక్షల్లో విజయం, ఉద్యోగులకు ప్రమోషన్ వార్త వినిపిస్తుంది. కుటుంబంలో శుభకార్యానికి ప్లాన్ చేసుకుంటారు

మకర రాశి : శని ప్రభావంతో ఇన్నాళ్లు ఇబ్బంది పడిన మకర రాశి వారికి ఇక తిరుగు లేదు. నవంబర్ 1 నుంచి ఆర్థికంగా బలపడతారు. అప్పుల బాధ తగ్గుతుంది. స్థిరాస్తి కొనుగోలు లేదా వాహన యోగం ఉంది. ఉద్యోగంలో మీ టాలెంట్ కు గుర్తింపు వస్తుంది, పై అధికారులు మెచ్చుకుంటారు. నిరుద్యోగులకు అనుకున్న చోట నుంచే ఇంటర్వ్యూ కాల్ వస్తుంది.

తుల రాశి : తుల రాశి వారికి సూర్య సంచారం కలిసి రావడంతో పేరు ప్రతిష్టలు పెరుగుతాయి. సొంత వ్యాపారం చేసేవారికి లాభాలు రెట్టింపు అవుతాయి. భాగస్వామ్య వ్యాపారాల్లో ఉన్న గొడవలు సర్దుకుంటాయి. జీవిత భాగస్వామి నుంచి మంచి సపోర్ట్ లభిస్తుంది. అవివాహితులకు మంచి సంబంధం కుదిరే అవకాశం ఉంది. విదేశాలకు వెళ్లాలనుకునే వారి కల నెరవేరుతుంది.