
అప్పుడే కట్ చేసిన మటన్ ఎరుపు రంగులో ఉంటుంది. కొంచం రంగు మారిన అది తాజా మటన్ కాదని గుర్తు పెట్టుకోండి. ఇలాంటిది తిన్నా కూడా ఆరోగ్యానికి మంచిది కాదు. మరీ ఎర్రగా కనిపించినా కూడా దానిని తీసుకోకండి.

మీరు చేతితో పట్టుకుని చుస్తే అర్ధమవుతుంది. ఫ్రెష్ రెడ్ మీట్ అయితే, మాంసం గట్టిగా ఉంటుంది. అలా కాకుండా పట్టుకోగానే జారిపోతోంటే అది నిల్వ ఉంచినదని గ్రహించండి. తాజాది అస్సల జారిపోదు.

వాసనతో కూడా మటన్ ఫ్రెష్ గా ఉందో? లేదో ఈజీగా గుర్తించవచ్చు. తాజా మటన్ అయితే వాసన అసలు రాదు. నిల్వ ఉంచినది కానీ, నిన్నటిది కానీ వాసన వస్తుంది. ఇంకా మీరు ఆన్లైన్ పెడితే దానిని చెక్ చేసి తీసుకోవడం మంచిది.

ఎముకలను చూసి కూడా ఇది తాజాగా ఉందో లేదో గుర్తించవచ్చు. ఫ్రెష్ మటన్ అయితే తెల్లటి రంగులో ఉంటుంది. ఇక కొవ్వు పసుపు కలర్ లో ఉంటే అది నిల్వ ఉంచిన మటన్ అని తెలుసుకోండి. అలాగే చిన్న ఎముకలు మెత్త బడినా కూడా డి నిల్వ కాదని గ్రహించండి.

మటన్ కొనేటప్పుడు ఇవి తప్పక పాటించండి.. మటన్ కొనేటప్పుడు క్వాలిటీ ఉన్న మాంసాన్ని తీసుకోండి. లైసెన్స్ ఉన్న వాటి నుంచే కొనుగోలు చేయండి. శుభ్రత లేని షాపుల్లో మటన్ కొనకండి. మాంసం గట్టిగా ఉన్నది కూడా అస్సలు తీసుకోకండి.