
సాయంత్రం సమయంలో మీరు తినాలి అనుకుంటే.. ఈ స్నాక్స్ చాలా బెటర్. మీరు వీటిని వేడి వేడి టీతో కూడా తీసుకోవచ్చు. ఇంతవరకు మీరు ఇలాంటి టిఫిన్ తిని ఉండరు. వీటి టేస్ట్ కూడా అంత మంచిగా ఉంటుంది. ఈ పకోడీల్లో శనగపిండికి బదులు గోధుమ పిండిని వేస్తారు. దీనిని ఇక చేయాలంటే?

గోధుమ పిండి పకోడీ రెసిపీకి కావలసిన పదార్థాలు: ఒక కప్పున్నర గోధుమ పిండి, రెండు చిన్న ఉల్లిపాయ ముక్కలు, 4 పచ్చిమిర్చి, ఒక టీ స్పూన్ అల్లం పేస్ట్, కరివేపాకు ఆకులు, ఒక టీ స్పూన్ జీలకర్ర, ఒక టీ స్పూన్ కారం, ఒక టీ స్పూన్ ధనియాల పొడి, రుచికి సరిపడా ఉప్పు,కొద్దిగా బియ్యపు పిండి, రెండు టేబుల్ స్పూన్స్ ఆయిల్ ను కూడా తీసుకోవాలి.

గోధుమ పిండి పకోడీ తయారీ విధానం: ముందుగా మీరు గోధుమ పిండిని ఒక గిన్నెలో తీసుకోవాలి. ఆ తర్వాత దీనిలో కొన్ని నీళ్లు పోసి నాలుగు ఉల్లిపాయ ముక్కలు, రెండు పచ్చిమిర్చి, కొద్దిగా అల్లం, 10 కరివేపాకు ఆకులు వేసి దీనిని కలపాలి. ఇంకా దీనిలో మీరు కొంచం మీరు బియ్యపు పిండి, ఒక టీ స్పూన్ జీలకర్ర, కొంచం కారం, అర టీ స్పూన్ ధనియాల పొడి, ఉప్పు వేసి మిక్స్ అయ్యేలా కలపాలి.

ఇంకా దీనిని మీరు పకోడీ మిశ్రమంలా చేసుకోవాలి. ఇప్పుడు పాన్ తీసుకుని నూనె వేసి అది బాగా వేడయ్యాక దీనిని చిన్న చిన్న ముద్దలుగా వేసుకోవాలి. ఆ తరువాత వీటిని మీడియం మంటపై వీటిని రంగు మారే వరకు బాగా వేయించాలి. ఒక వైపు బాగా కాలిన తర్వాత రెండో వైపు కూడా బాగా కాల్చుకోవాలి.

రెండు వైపులా మంచిగా కాల్చుకున్న తర్వాత వీటిని తీసి మీరు క్రంచీ లా కావాలంటే ఇంకోసారి ఎర్రగా వేయించాలి ఆ తర్వాత ఇవి ఇవి వేగిన తర్వాత వీటిని తీసి టిష్యూపైన పెట్టాలి. ఈ వేడి వేడి గోధుమ పిండి పకోడీలను మీరు ఎర్ర టమాటా చట్నీతో తింటే టేస్ట్ అదిరిపోతోంది.