నవరాత్రుల స్పెషల్ ప్రసాదం చింతపండు పులిహోర.. ఈ పర్ఫెక్ట్ కొలతలతో ఎన్ని కేజీలైన ఈజీగా చేసేయొచ్చు

Updated on: Oct 09, 2026 | 7:35 PM

దేవి నవరాత్రుల వేడుకలలో అమ్మవారికి సమర్పించే నైవేద్యాలలో చింతపండు పులిహోర చాలా ప్రత్యేకమైనది. ఈ పులిహోర రుచి దేవాలయాలలో ప్రసాదంగా అందించే పులిహోరను తలపిస్తుంది. ఈ రెసిపీలో, పావు కిలో బియ్యంతో పక్కా కొలతలతో చింతపండు పులిహోరను ఎలా తయారుచేయాలో ఇక్కడ చదివి తెలుసుకుందాం..

1 / 5

పులిహోర కోసం ఒక గ్లాసు బియ్యాన్ని తీసుకోవాలి. బియ్యాన్ని ఒకటి లేదా రెండు సార్లు శుభ్రంగా కడిగి, ఒక గ్లాసు బియ్యానికి రెండు గ్లాసుల నీళ్లు పోయాలి. వీలైతే, బియ్యాన్ని కనీసం ఒక గంట పాటు నానబెట్టడం వల్ల అన్నం చక్కగా ఉడుకుతుంది. బియ్యం నానబెట్టిన తర్వాత, పావు టీస్పూన్ లో సగం పసుపు, ఒక టేబుల్ స్పూన్ నూనె కలిపి కుక్కర్‌లో మీడియం ఫ్లేమ్‌లో మూడు విజిల్స్ వచ్చే వరకు ఉడికించాలి. ఇలా చేయడం వల్ల అన్నం ముద్దగా కాకుండా పొడిపొడిగా వస్తుంది, ఇది పులిహోరకు చాలా ముఖ్యం.

2 / 5
పావు కిలో బియ్యానికి 50 గ్రాముల చింతపండు అవసరం అవుతుంది. నిమ్మకాయ సైజు అంత చింతపండును తీసుకొని ఒకసారి కడిగి, వేడినీళ్లు పోసి 15 నిమిషాల పాటు నానబెట్టాలి. వేడినీటిలో నానబెట్టడం వల్ల చింతపండు త్వరగా మెత్తబడుతుంది. 15 నిమిషాల తర్వాత, చింతపండును బాగా కలిపి గుజ్జును తీయాలి. ఈ గుజ్జును వేరు వేసి పిప్పిని వేరు చేయాలి. ఒకసారి తీసిన పిప్పిలో మళ్ళీ కొద్దిగా నీళ్లు పోసి కలిపి, తిరిగి వడకట్టాలి. చింతపండు గుజ్జు మరీ చిక్కగా గాని, మరీ పల్చగా గాని ఉండకూడదు.

3 / 5
మందపాటి అడుగున్న ఒక పాన్‌ను స్టవ్ మీద పెట్టి, అందులో నాలుగు టేబుల్ స్పూన్ల నూనె, ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేయాలి. నెయ్యి పులిహోర రుచిని పెంచుతుంది. నూనె వేడయ్యాక, ఒక గుప్పెడు పల్లీలు వేసి సగం వరకు వేయించాలి. సగం వేగిన తర్వాత, అర టీస్పూన్ ఆవాలు, ఒక టేబుల్ స్పూన్ పచ్చిశనగపప్పు, ఒక టేబుల్ స్పూన్ మినపగుళ్లు వేసి వేయించాలి. ఇవి సగం వేగిన తర్వాత, కొన్ని జీడిపప్పు కూడా వేసి ఎర్రగా అయ్యేంత వరకు వేయించి, నూనె లేకుండా ఒక గిన్నెలోకి తీసి పక్కన పెట్టుకోవాలి. పోపు దినుసులు చింతపండు పులుసులో ఉడికితే మెత్తగా అవుతాయి కాబట్టి, వాటిని ముందుగానే తీసి పక్కన పెట్టుకోవాలి.

4 / 5
అదే నూనెలో, ఒక టేబుల్ స్పూన్ అల్లం ముక్కను సన్నగా తరిగి వేయాలి. పచ్చిమిర్చిని మధ్యలో గాటు పెట్టి, రెండు ఎండుమిర్చి, రెండు మూడు రెమ్మల కరివేపాకు వేసి అల్లం పచ్చివాసన పోయేంత వరకు వేయించాలి. తర్వాత పావు టీస్పూన్ ఇంగువ వేసి అంతా బాగా కలిసేలా కలుపుకోవాలి. ఇప్పుడు సిద్ధం చేసుకున్న చింతపండు గుజ్జును ఇందులో వేయాలి. పావు టీస్పూన్ కంటే కొంచెం తక్కువ పసుపు, రుచికి సరిపడినంత ఉప్పు,  ఒక టీస్పూన్ బెల్లం వేసి బాగా కలపాలి. మూత పెట్టి, లో-మీడియం ఫ్లేమ్‌లో అడుగు అంటకుండా మధ్యమధ్యలో కలుపుతూ, గుజ్జు దగ్గరపడి నూనె పైకి తేలే వరకు ఉడికించాలి. గుజ్జు మరీ చిక్కగా అవ్వకూడదు, మధ్యస్థంగా ఉండాలి

5 / 5

ఉడికించిన అన్నాన్ని పులిహోర కలపడానికి వీలుగా ఉండే ఒక పెద్ద పళ్లెంలోకి లేదా గిన్నెలోకి తీసుకోవాలి. వేడి అన్నంలో ఒక రెమ్మ కరివేపాకు వేసి కలిపితే మంచి సువాసన వస్తుంది. అన్నాన్ని పూర్తిగా చల్లారనివ్వాలి. అన్నం వేడి తగ్గిన తర్వాత, ముందుగా వేయించి పక్కన పెట్టుకున్న పోపు దినుసులను, అలాగే తయారుచేసుకున్న చింతపండు పులుసును అన్నంలో వేయాలి. పావు కిలో బియ్యానికి, గుజ్జు మొత్తం సరిపోతుంది. గరిటెతో కాకుండా, చేతితో బాగా కలిపితే పులిహోర మరింత రుచిగా, దినుసులు అన్నానికి బాగా పడతాయి.
ఇలా పక్కా కొలతలతో తయారుచేసిన చింతపండు పులిహోర దేవి నవరాత్రుల ప్రసాదంగా ఎంతో మంచిది

ఉడికించిన అన్నాన్ని పులిహోర కలపడానికి వీలుగా ఉండే ఒక పెద్ద పళ్లెంలోకి లేదా గిన్నెలోకి తీసుకోవాలి. వేడి అన్నంలో ఒక రెమ్మ కరివేపాకు వేసి కలిపితే మంచి సువాసన వస్తుంది. అన్నాన్ని పూర్తిగా చల్లారనివ్వాలి. అన్నం వేడి తగ్గిన తర్వాత, ముందుగా వేయించి పక్కన పెట్టుకున్న పోపు దినుసులను, అలాగే తయారుచేసుకున్న చింతపండు పులుసును అన్నంలో వేయాలి. పావు కిలో బియ్యానికి, గుజ్జు మొత్తం సరిపోతుంది. గరిటెతో కాకుండా, చేతితో బాగా కలిపితే పులిహోర మరింత రుచిగా, దినుసులు అన్నానికి బాగా పడతాయి. ఇలా పక్కా కొలతలతో తయారుచేసిన చింతపండు పులిహోర దేవి నవరాత్రుల ప్రసాదంగా ఎంతో మంచిది

Loading...
Unable to load recommendations.
Follow Us