తెల్ల జుట్టును నల్లగా మార్చే సోంపు మ్యాజిక్… ఇంట్లోనే నేచురల్ డై.. ఇలా వాడారంటే..

Updated on: Mar 30, 2026 | 8:07 PM

నేటి ఆధునిక జీవనశైలి, ఆహారపు అలవాట్ల కారణంగా అనారోగ్య సమస్యలతో పాటు, జుట్టు సమస్యలతో బాధపడేవారి సంఖ్య రోజు రోజుకీ పెరిగిపోతోంది. చాలా మంది చిన్న వయసులోనే తెల్ల జుట్టు, వెంట్రుకలు రాలిపోవటం వంటి సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు. 20ఏళ్లలోనే ఎక్కువ మందిని వేధిస్తున్న తెల్ల జుట్టును వదిలించుకోవడానికి మార్కెట్‌లోఎన్నో కెమికల్స్ తో నిండిన రంగులు అందుబాటులో ఉన్నాయి. వాటి వల్ల జుట్టు మరింత డ్యామేజ్ అవుతుంది. చాలా సైడ్ ఎఫెక్ట్స్ కూడా వస్తాయి. అలా సైడ్ ఎఫెక్ట్స్ రాకుండా.. తెల్ల జుట్టును శాశ్వతంగా నల్లగా ఎలా మార్చుకోవచ్చో ఇక్కడ తెలుసుకుందాం..

1 / 5
చిన్న వయసులోనే జుట్టు తెల్లబడటం (Premature Greening) అనేది ప్రస్తుతం చాలా మంది ఎదుర్కొంటున్న సమస్య. దీని కోసం కెమికల్ డైలు వాడటం వల్ల జుట్టు మరింత దెబ్బతింటుంది. మార్కెట్లో దొరికే హెయిర్ కలర్స్‌లో అమ్మోనియా వంటి రసాయనాలు ఉంటాయి. ఇవి జుట్టును పాడు చేస్తాయి. అయితే, మన వంటగదిలో ఉండే సోంపు గింజలు (Fennel Seeds) జుట్టును సహజంగా నల్లగా మార్చడంలో అద్భుతంగా పనిచేస్తాయి.

2 / 5
సోంపులో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్, ఫైటోన్యూట్రియెంట్స్ మెలనిన్ ఉత్పత్తిని పెంచడానికి సహాయపడతాయి.  సోంపు గింజలను ఉపయోగించి జుట్టుకు సహజంగా నల్లగా మార్చుకోవచ్చునని తెలిస్తే మీరు షాక్‌ అవుతారు. సోంపు గింజల్లో విటమిన్ సి, పొటాషియం, ఐరన్, మెగ్నీషియం పుష్కలంగా ఉంటాయి. ఇవి జుట్టు కుదుళ్లను బలోపేతం చేయడమే కాకుండా, జుట్టు తన సహజ రంగును కోల్పోకుండా (Pigmentation) కాపాడతాయి.

3 / 5
సొంపుతో జుట్టుకు రంగు వేసే విధానంలో ముందుగా రెండు చెంచాల సోంపు గింజలను ఒక గ్లాసు నీటిలో వేసి సగం అయ్యే వరకు మరిగించాలి. ఈ నీటిని చల్లార్చి ఒక స్ప్రే బాటిల్‌లో పోయాలి. దీన్ని వారానికి రెండు మూడు సార్లు జుట్టు కుదుళ్లకు స్ప్రే చేసి మసాజ్ చేయడం వల్ల తెల్ల జుట్టు సమస్య క్రమంగా తగ్గుతుంది.

4 / 5
సోంపు, హెన్నా ప్యాక్ కూడా వేసుకోవచ్చు.  దీనికోసం సోంపు గింజలను మెత్తని పొడిలా చేసుకోవాలి. మీ జుట్టు పొడవును బట్టి గోరింటాకు పొడి (Henna) తీసుకుని, అందులో రెండు స్పూన్ల సోంపు పొడి కలపాలి.
ఈ మిశ్రమాన్ని టీ డికాషన్‌తో కలిపి రాత్రంతా నానబెట్టాలి. మరుసటి రోజు జుట్టుకు పట్టించి 2 గంటల తర్వాత కడిగేయాలి. ఇది జుట్టుకు ముదురు రంగును, మెరుపును ఇస్తుంది.

సోంపు, హెన్నా ప్యాక్ కూడా వేసుకోవచ్చు. దీనికోసం సోంపు గింజలను మెత్తని పొడిలా చేసుకోవాలి. మీ జుట్టు పొడవును బట్టి గోరింటాకు పొడి (Henna) తీసుకుని, అందులో రెండు స్పూన్ల సోంపు పొడి కలపాలి. ఈ మిశ్రమాన్ని టీ డికాషన్‌తో కలిపి రాత్రంతా నానబెట్టాలి. మరుసటి రోజు జుట్టుకు పట్టించి 2 గంటల తర్వాత కడిగేయాలి. ఇది జుట్టుకు ముదురు రంగును, మెరుపును ఇస్తుంది.

5 / 5
ప్రయోజనాలు: సోంపూ హెయిర్‌ ప్యాక్‌తో కెమికల్స్ లేకుండా జుట్టు నల్లబడుతుంది. సోంపులో ఉండే యాంటీ ఫంగల్ గుణాలు చుండ్రును తగ్గిస్తాయి. ఇది రక్త ప్రసరణను మెరుగుపరిచి జుట్టు ఒత్తుగా పెరిగేలా చేస్తుంది. క్రమం తప్పకుండా వాడుతూ ఉంటే త్వరలోనే మీ జుట్టుకు మంచి రంగు రావడమే కాకుండా, జుట్టు రాలడం తగ్గి పట్టులా మెరుస్తుంది. ఇది ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేని సురక్షితమైన మార్గం.

Follow Us